
TDP-Janasena New Logo: టీడీపీ-జనసేన కొత్త లోగో.. 'రా కదలి రా!'పేరుతో ప్రజల్లోకి..
ఈ వార్తాకథనం ఏంటి
జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఆంధ్రప్రదేశ్ జనాల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా బుధవారం నుంచి 'రా కదలి రా!' పేరిట ప్రత్యేక కార్యక్రమాలకు టీడీపీ శ్రీకారం చుట్టింది.
ఈ క్రమంలో మంగళవారం టీడీపీ - జనసేన ఎన్నికల గుర్తులతో తెలుగుదేశం పార్టీ కొత్త లోగో ఆవిష్కరించింది.
సైకిల్ - గాజు గ్లాసుతో కూడిన లోగోను ఎన్టీఆర్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.
అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ ఆవిర్భావం సమయంలో ఎన్టీఆర్ ఇచ్చిన ''రా కదలిరా' పిలుపునే మళ్లీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
జగన్ పాలనలో విధ్వంసాలు, వైఫల్యాలు తప్ప.. అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను ఆందోళనప్రదేశ్‌గా జగన్మోహన్ రెడ్డి మార్చారని మండిపడ్డారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రా కదలి రా పేరిట టీడీపీ కార్యక్రమాలు
ఈ నెల 5 నుంచి రా కదలి రా పేరిట టీడీపీ కార్యక్రమాలు
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2024
టీడీపీ-జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరణ
లోగోను ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు
పంచాయతీ సమస్యలపై...
రేపు సర్పంచ్‌లతో రాష్ట్ర స్థాయి సదస్సు
బీసీలకు జరిగిన అన్యాయంపై...
4న జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు
5 నుంచి… pic.twitter.com/gFTy8CVHUn