TDP: టీడీపీ పునర్వ్యవస్థీకరణలో కీలక అడుగు.. టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకాలు దాదాపు ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో జిల్లా అధ్యక్షుల నియామకాలు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయని వారు, అలాగే ఇప్పటివరకు నామినేటెడ్ పదవులు దక్కని నేతల నుంచి ఈ పదవులకు పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో పలువురు పేర్లను పార్టీ అధిష్ఠానం ఇప్పటికే తుది నిర్ణయానికి తీసుకువచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సంబంధిత నేతలకు ఈ విషయం ముందుగానే తెలియజేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నియామకాలపై పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఖరారైన టీడీపీ జిల్లా అధ్యక్షుల జాబితా ఇలా ఉంది
Details
అభ్యర్థుల జాబితా ఇదే
అనంతపురం : కాలవ శ్రీనివాసులు హిందూపురం : ఎంఎస్ రాజు విజయనగరం : కిమిడి నాగార్జున నంద్యాల : సుబ్బారెడ్డి తిరుపతి : పనబాక లక్ష్మి చిత్తూరు : షణ్ముగం రాజంపేట : సుగవాసి ప్రసాద్ ప్రకాశం : ఉగ్ర నరసింహారెడ్డి నెల్లూరు : రేచర్ల వెంకటేశ్వరరావు కాకినాడ : జ్యోతుల నెహ్రూ ఈ నియామకాలతో పార్టీని జిల్లా స్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో టీడీపీ అధిష్ఠానం అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.