Kesineni Nani: కేశినేని నానికి షాకిచ్చిన టీడీపీ.. విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడ టీడీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చంద్రబాబు సభకు సంబంధించి కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మొదలైంది.
ఈ నేపథ్యంలో విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani)కి టీడీపీ (TDP) హైకమాండ్ షాకిచ్చింది.
రానున్న ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చింది.
ఇక ఈ నెల 7న తిరువూరులో జరిగే చంద్రబాబు నాయుడు సభ బాధ్యతలు కూడా కేశినేని చిన్నికి అప్పగించారని, ఈ విషయంలో కలగచేసుకోవద్దని అదిష్టానం సందేశం ఇచ్చినట్లు నాని వెల్లడించారు.
పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీసుకున్న నిర్ణయాన్ని తూచ తప్పకుండా పాటిస్తానని నాని తెలిపారు.
Details
అధినేత ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటిస్తా: కేశినేని
లోక్ సభ అభ్యర్థిగా తన స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు.
అధినేత ఆజ్ఞలను తు.చ. తప్పకుండా శిరసావహిస్తానని, దానికి కట్టుబడి ఉంటానని కేశినేని నాని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీలో తాను కార్యకర్తను మాత్రమేనని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికే తాను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.
పార్టీలో చిన్ని చిన్న మనస్ఫర్థలు తప్పవని, అవన్నీ టీ కప్పులో తుఫానులా తొలగి పోవాల్సిందేనని వెల్లడించారు.