తదుపరి వార్తా కథనం

TDP: విరాళాల వెబ్ సైట్ ప్రారంభించిన టిడిపి.. మొదటి విరాళం ఎంతో తెలుసా?
వ్రాసిన వారు
Stalin
Apr 09, 2024
05:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్ సైట్ ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
https://tdpforandhra.com/ పేరుతో విరాళాలు సేకరించనున్నారు.
మంగళగిరిలో టిడిపి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు .
ఈ మేరకు పార్టీకి వెబ్ సైట్ ద్వారా రూ. 99,999 మేర తొలి విరాళాన్ని చంద్రబాబు అందించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టిడిపి అభిమానులు, మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని కోరారు. విరాళాలు ఇచ్చిన వారికీ రసీదు ఇస్తామని చెప్పారు.
డిజిటల్ కరెన్సీ ద్వారా ట్రాకింగ్ చాలా సులువు అవుతుందన్నారు. అమెరికాలోనూ రాజకీయ విరాళాలకు న్యాయపరంగా అనుమతి ఉందన్నారు.