AP CID : టీడీపీకి మరో చిక్కు.. ఆ నిధులెలా వచ్చాయని నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మరోసారి చిక్కుల్లో పడింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
టీడీపీ ఖాతాల్లోకి వచ్చిన నిధుల గురించి వివరాలను ఇవ్వాలని సదరు నోటీసులో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు మంగళవారం నోటీసులు పంపారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి ఆశోక్ బాబుకు సీఐడీ కానిస్టేబుల్ నోటీసు ఇచ్చి వెళ్లారు. ఈ నెల 18లోగా వివరాలు ఇవ్వాలని నోటీసు ద్వారా కోరారు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ ఖాతాకు వచ్చిన వివరాలు కావాలని సీఐడీ ఆ నోటీసులో వివరించింది.
details
సీఐడీపై భగ్గమంటున్న టీడీపీ శ్రేణులు
దీనిపై స్పందించిన తెలుగుదేశం నేతలు, పార్టీ విరాళాల గురించి ఏపీ సీఐడీ ప్రశ్నించడంపై భగ్గుమంటున్నారు. కావాలనే తమ పార్టీపై సీఐడీ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఇదే సమయంలో పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసులను కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తుంది. స్కిల్ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9న సీఐడీ అరెస్ట్ చేసింది.
ఈ కేసులో అక్టోబర్ 31న చంద్రబాబుకు బెయిల్ మంజూరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నెల 28న చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ సైతం ఇచ్చింది.
అదే రోజు సాయంత్రం లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం త్వరలోనే తీర్పునిచ్చే అవకాశం ఉంది.