Page Loader
Ap Skill Development : స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. ఆ 12మంది ఐఏఎస్ అధికారులపై సీఐడీకి ఫిర్యాదు
ఆ 12మంది ఐఏఎస్ అధికారులపై సీఐడీకి ఫిర్యాదు

Ap Skill Development : స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్.. ఆ 12మంది ఐఏఎస్ అధికారులపై సీఐడీకి ఫిర్యాదు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 03, 2023
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ మేరకు 12 మంది ఐఏఎస్ అధికారులపై ఫిర్యాదు నమోదైంది. కుంభకోణంలో భాగంగా 12 మందికిపైగా ఐఏఎస్ ఆఫీసర్లను విచారణ పరిధిలోకి తీసుకురావాలని వజ్జా శ్రీనివాసరావు, తరపు న్యాయవాది ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. సీమెన్స్ ప్రాజెక్ట్ అమలు, పర్యవేక్షణ కమిటీలోని ఐఏఎస్ లను ప్రశ్నించాలని కంప్లైంట్ లో పేర్కొన్నారు. అజయ్ కల్లం,అజయ్ జైన్,రావత్, రవిచంద్ర,ఉదయ్ లక్ష్మి,ప్రేమ చంద్రారెడ్డి,సిసోడియా కేవీ సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్,కృతిక శుక్లా,అర్జా శ్రీకాంత్, జయలక్ష్మిలను కూడా విచారించాలన్నారు. ప్రస్తుతం ఈ జాబితాలోని కొందరు కీలక పదవుల్లో ఉన్నారు. మరికొందరు రిటైర్ అయ్యారు.

details

ఆ 12 మంది అధికారులపై కోర్టును ఆశ్రయిస్తాం : ఫిర్యాదుదారు

మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రస్తుత ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, సీఎండీ బంగారు రాజు, సీఎఫ్ఓ,సీఈవోలను ప్రశ్నించాలన్నారు. కాంట్రాక్టులు, చెక్ పవర్ తోే సంబంధం కలిగిన అందరినీ విచారించాలని కోరారు.ఈ మేరకు ఆయా ఫిర్యాదు లేఖపై సీఐడీ ఏ మేర చర్యలు తీసుకోనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో భాగంగా కీలకంగా ఉన్న ఓ ఐఏఎస్ అధికారిని తప్పించారని టీడీపీ ఆరోపిస్తోంది. కుంభకోణం జరిగిందని అటు సీఐడీ అధికారులు ఇటు సీఐడీ తరపు లాయర్లు స్పష్టంగా చెబుతున్నారని, కానీ మనీ మొబిలైజేషన్, చెక్ పవర్, బిల్లుల చెల్లింపులు చేసిన అధికారులను ఈ కేసు పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదన్నారు. దీనిపై కోర్టుని ఆశ్రయిస్తామన్నారు.