సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన.. టీడీపీ-జనసేన కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోసం ఇప్పటి నుంచే టీడీపీ-జనసేన కూటమి కసరత్తు ప్రారంభించింది.
తాజాగా ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో ముందడుగు వేశాయి.
ఈ సందర్భంగా ఇరు పార్టీ నేతలు 11 అంశాలతో మినీ మేనిఫెస్టోను రూపొందించారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు 10లక్షల వరకు సబ్సిడీని అందిస్తామని యనమల రామకృష్ణుడు తెలిపారు.
పేదలకు ఉచిత ఇసుక ఇచ్చి, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామన్నారు.
సౌభాగ్యపదం పేరుతో యువత వ్యాపారాలను చేసేందుకు ఆర్థిక సాయం అందించే విషయాన్ని జనసేన ప్రతిపాదించిందని వెల్లడించారు.
Details
యువతకు ఉపాధి కల్పించడంపై ప్రధాన దృష్టి
మిని మేనిఫెస్టో కమిటీపై తొలిసారి జనసేన-టీడీపీ నాయకులు సమావేశమయ్యారు.
ఈ కమిటీ టీడీపీ తరుఫున యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి హజరు కాగా, జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ పాల్గొన్నారు.
ఇందులో టీడీపీ ఆరు అంశాలను ప్రతిపాదించగా, జనసేన 5 అంశాలను ప్రతిపాదించింది.
ఇక యువతకు ఉపాధి కల్పించడంపై ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉండనున్నాయి.
ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు టీడీపీ, జనసేన కూటమిపై మరింత నమ్మకం పెరుగుతాయని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.