Page Loader
AP Nominated Posts: నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి ప్రభుత్వం దృష్టి.. కొత్త జాబితా సిద్ధం!
నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి ప్రభుత్వం దృష్టి.. కొత్త జాబితా సిద్ధం!

AP Nominated Posts: నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి ప్రభుత్వం దృష్టి.. కొత్త జాబితా సిద్ధం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2025
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్‌ పదవుల భర్తీలో మరింత వేగంగా కదులుతోంది. ఇప్పటి వరకు పలు దఫాల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, త్వరలో మరొకసారి ఈ ప్రక్రియను కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల తొలి వారంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈసారి ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పదవులు భర్తీ చేయడం ప్రాధాన్యంగా ఉంది. రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్‌ల చైర్మన్‌లు, డైరెక్టర్ల పదవులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక ఇంద్రకీలాద్రి, సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ప్రముఖ ఆలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నారు.

Details

జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం

జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పదవుల భర్తీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధిత పేర్లు పంపించాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. మరోవైపు, టీడీపీ కేంద్ర కార్యాలయానికి కొందరి జాబితా చేరగా, ఇవాళ లేదా రేపట్లో మరికొందరి పేర్లు చేరే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూటమి ఒప్పందం ప్రకారం టీడీపీకి 80 శాతం, జనసేనకు 15 శాతం, బీజేపీకి 5 శాతం భాగస్వామ్యం కేటాయించేలా కసరత్తు జరుగుతోంది. జనసేన, బీజేపీ ప్రతిపాదనలు కూడా తీసుకుని, పాలక మండళ్లు, కార్పొరేషన్ చైర్మన్‌లు, డైరెక్టర్ల నియామకం పూర్తి తర్వాత సంబంధిత జీవోలను కూటమి ప్రభుత్వం విడుదల చేయనుంది