
Marri Rajashekar: టీడీపీలో చేరనున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్
ఈ వార్తాకథనం ఏంటి
ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఈరోజు టీడీపీ పార్టీలో చేరనున్నారు.శుక్రవారం సాయంత్రం 6గంటలకు ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో పసుపు కండువ కప్పి పార్టీలో అధికారికంగా చేరతారు. గతశాసనసభా సమావేశాల చివరిరోజున రాజశేఖర్ వైసీపీ పార్టీ,అలాగే శాసన మండలి సభ్యత్వం నుంచి రాజీనామా చేశారు. రాజశేఖర్ గతంలో చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా,అలాగే వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్‌గా విధులు నిర్వహించారు. జగన్ పరిపాలనలో ప్రతిసారీ ఇచ్చిన మాటలు నెరవేర్చకపోవడం,పార్టీలో తగిన గుర్తింపు లభించకపోవడం వంటి కారణాల వలన ఆయన అసంతృప్తి చెందారు. అదనంగా,చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజనితో ఉన్న వ్యక్తిగత విభేదాలు వల్ల వైసీపీకి రాజశేఖర్ గుడ్‌బై చెప్పడానికి కారణమయ్యాయి. ఈనేపథ్యంలో ఆయన రాజీనామాను శాసన మండలి చైర్మన్ ఇంకా అధికారికంగా ఆమోదించలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్సీ రాజశేఖర్..
టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్సీ రాజశేఖర్..
— Telugu Stride (@TeluguStride) September 19, 2025
గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీకి రాజశేఖర్ రాజీనామా..సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న మర్రి రాజశేఖర్.. చిలకలూరిపేటలో వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాజశేఖర్.. విడదల రజనితో విభేదాల కారణంగా వైసీపీకి రాజశేఖర్ గుడ్ బై..… pic.twitter.com/IbdYcju92v