Page Loader
High Court: చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం 
High Court: చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం

High Court: చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం 

వ్రాసిన వారు Stalin
Nov 27, 2023
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

మద్యం కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఎక్సైజ్ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించిన చంద్రబాబు, కొల్లు రవీంద్ర (Kollu Ravindra) దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు(High Court) తీర్పును రిజర్వు చేసింది. దీంతో తీర్పు వచ్చే వరకు చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఏపీ హైకోర్టు ఆదేశించింది. 2014-19 మధ్య చంద్రాబాబు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సమయంలో మద్యం ప్రివిలేజ్ ఫీజు మినహాయింపుతో రాష్ట్ర ఖజానాకు రూ.1,500 కోట్లు నష్టం వాటిల్లిందని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏపీ హైకోర్టులో కీలక ఆదేశాలు