Kishore Chandra Deo: కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్ర దేవ్ టీడీపీకి రాజీనామా
మాజీ కేంద్ర మంత్రి, వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు చర్చలు జరపటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనంటూ ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని UPA-II ప్రభుత్వంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిగా పనిచేసిన చంద్రదేవ్, రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన 2014 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొని 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. చంద్రదేవ్ అరకు స్థానం నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు.