
Pendyala Krishna Babu Passed Away: కొవ్వూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన కృష్ణబాబుగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు.
కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మరణించారు.
ఈరోజు తెల్లవారుజామున ఆయన మరణ వార్తను వైద్యులు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
ఆంధ్రా షుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ మేనల్లుడు కృష్ణబాబు. అయన కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Details
అచ్చిబాబు చెప్పినట్లే అక్కడ వినాల్సిన పరిస్థితి
నియోజకవర్గాల పునర్విభజనలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) నియోజకవర్గంగా మారే వరకు ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి కంచుకోటగా ఉండేది.
ఈ మార్పుతో కృష్ణబాబు రాజకీయ రంగానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పటి నుండి, టివి రామారావు, జవహర్‌తో సహా ఇతర టిడిపి సభ్యులు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జవహర్ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైనా.. పెండ్యాల కుటుంబానిదే ఈ నియోజకవర్గంలో పైచేయి.
ముఖ్యంగా కృష్ణబాబు సోదరుడు అచ్చిబాబు చెప్పినట్లే అక్కడ వినాల్సిన పరిస్థితి ఉంటుంది.