TDP-Janasena: నేడు టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల
టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ జాబితాలో దాదాపు 60-70 మంది పేర్లు ఉంటాయని కూటమి వర్గాలు తెలిపాయి. వైసీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసిన నేపేథ్యంలో.. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఇక జాప్యం చేయొద్దని అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ భావించినట్లు తెలుస్తోంది. శనివారం తొలి జాబితాను ప్రకటించడం ద్వారా.. టీడీపీ ప్రచారంలో ఊపు తీసుకురావాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే, అభ్యర్థులను ప్రకటించడానికి ముందు.. ఇరు పార్టీల నేతలు తమ జిల్లాల ఇన్‌చార్జ్‌లతో సమావేశం కానున్నారు. బీజేపీతో పొత్తుపై అధికారికంగా ప్రకటన వెలువడిన తర్వాత రెండో జాబితాను త్వరలో ప్రకటిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.