LOADING...
Ganta Srinivas : శాశ్వతంగా రాజకీయాలకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం: గంటా సంచలన ప్రకటన 
శాశ్వతంగా రాజకీయాలకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం: గంటా సంచలన ప్రకటన

Ganta Srinivas : శాశ్వతంగా రాజకీయాలకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం: గంటా సంచలన ప్రకటన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ మేనిఫెస్టోపై నేరుగా సవాల్ విసిరారు. విశాఖపట్నంలో 'పీఢ విరగడైన రోజు' అనే కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని హామీలపై ప్రశ్నలు సంధించారు. వైసీపీ ఇచ్చిన 10 హామీల్లో కనీసం ఐదు అమలు చేశారో నిరూపించగలిగితే తాను శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ, "ఊరంతా ఒక దారి అయితే.. ఉలికిపిట్టది మరో దారి" అన్నట్లు జగన్‌ పాలన ఉందని తీవ్రంగా ఎద్దేవా చేశారు.

Details

జగన్ ను తగిన శిక్ష విధించారు

వెన్నుపోట్లకు, కత్తిపోట్లకు జగన్ బ్రాండ్ అంబాసడర్‌గా తయారయ్యారని ఘాటు విమర్శలు చేశారు. ప్రజలు ఈసారి జగన్‌కు తగిన శిక్ష విధించారని, ఈ తీర్పే సంచలనాత్మకం అని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పనులను ప్రారంభించగానే విమర్శలు చేయడం దారుణమని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా అప్రతిష్ట కలిగించేలా వైసీపీ వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇదే సమయంలో ప్రజా సమస్యలపై గట్టి ప్రయత్నాలు చేసే కూటమి ప్రభుత్వానికి వైసీపీ అడ్డంకులు సృష్టించడం సరికాదని అన్నారు.