Page Loader
TDP: రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ 
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

TDP: రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2024
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీకి సంబంధించిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను ఎంపిక చేశారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరా బత్తుల రాజశేఖర్ పేరు ఖరారు చేశారు. మరోవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు పొన్నూరు గౌతంరెడ్డిని ఎంపిక చేసింది.

వివరాలు 

 ఓటర్ల జాబితా నోటిఫికేషన్ జారీ 

కాగా, వచ్చే ఏడాది మార్చి 29 నాటికి కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ పదవులు పూర్తవుతాయి. కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ, ఇళ్ల వెంకటేశ్వరరావుల పదవీ కాలం ఆ రోజు ముగియనుంది. దీనితో, ఎన్నికల సంఘం ఆ స్థానాల కోసం ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా నోటిఫికేషన్ జారీ చేశారు.