LOADING...
Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ 25 వేల పైన క్లోజ్
స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ 25 వేల పైన క్లోజ్

Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ 25 వేల పైన క్లోజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. త్రైమాసిక ఫలితాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు, పండగ వేళ వ్యాపారంతో సూచీలు ఈ ఉదయం ఉవ్వెత్తున ఎగిశాయి ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత నిఫ్టీ 26,000 మార్క్‌ను మళ్లీ దాటింది.అయితే,యూఎస్ ఫ్యూచర్ మార్కెట్‌ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో మదుపర్లు గరిష్ఠ స్థాయిల వద్ద లాభాలను స్వీకరించడం ప్రారంభించారు. దీని వల్ల సూచీలు మోస్తరు లాభాల పరిమితిలో నిలిచాయి. సెన్సెక్స్ ఉదయం 84,426.34 నుంచి 85,154.15 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 85,290.06 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.చివరికి 130.06 పాయింట్ల లాభంతో 84,556.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 22.80 పాయింట్ల లాభంతో 25,891.40 వద్ద ముగిసింది.

వివరాలు 

డాలరుతో రూపాయి మారకం విలువ 87.86గా నమోదు 

డాలరుతో రూపాయి మారకం విలువ 87.86 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు మంచి పెరుగుదల చూపించాయి. కానీ ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలు ఎదుర్కొన్నారు. అంతర్జాతీయంగా, రష్యన్ చమురు సంస్థలపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ 65 డాలర్ల పైగా కొనసాగుతోంది. బంగారం 4,109 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.