అంగారక గ్రహం మీద ఎగిరిన హెలికాప్టర్, వీడియో విడుదల చేసిన నాసా
ఈ వార్తాకథనం ఏంటి
మనిషి మనుగడకు భూమి తర్వాత అనువైనది అంగారక గ్రహం అని శాస్త్రవేత్తలు భావిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే అంగారక గ్రహం మీద జీవం ఉందేమోనని అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే అంగారక గ్రహం మీదకి రోవర్ లను పంపించింది నాసా. తాజాగా అంగారక గ్రహం మీద హెలికాప్టర్ ఎగిరినట్లు నాసా ఒక వీడియోను విడుదల చేసింది.
ఇన్ జెన్యూటీ అనే పేరు గల హెలికాప్టర్ సుమారు 60 అడుగుల ఎత్తు ఎగిరింది. అలాగే వెయ్యి అడుగుల దూరం ప్రయాణించినట్లు అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా తెలియజేసింది.
భూమి కాకుండా అవతల గ్రహం మీద హెలికాప్టర్ ఎగరడం, తమ పరిశోధనల్లో గొప్ప విజయమని నాసా తెలియజేసింది.
Details
హెలికాప్టర్ ఎగరడంతో అంగారక గ్రహం మీద లేచిన దుమ్ము
1903 లో విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్, ఏ విధంగా తమ పరిశోధనలు కొనసాగించారో.. అలాగే అంగారక గ్రహం మీద విమానాన్ని ఎగరేయడానికి పరిశోధనలు చేస్తామని నాసాకు చెందిన ప్లానెటరీ సైన్స్ డివిజన్ డైరెక్టర్ లోరీ గ్లేజ్ అన్నారు.
అంగారక గ్రహంపై హెలికాప్టర్ ఎగరడాన్ని నాసా కు చెందిన ప్రిజర్వారెన్స్ రోవర్ 400 అడుగుల దూరం నుంచి వీడియో తీసింది. ఈ వీడియోలో హెలికాప్టర్ స్టార్ట్ అయినప్పుడు అంగారక గ్రహం మీద దుమ్ము పైకి లేవడం కనిపిస్తుంది.
ఈ హెలికాప్టర్ ను ఉపయోగించి అంగారక గ్రహం ప్రాంత విశేషాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది నాసా. నాసా విడుదల చేసిన వీడియో ప్రస్తుతం యూట్యూట్ లో అందరికీ అందుబాటులో ఉంది.