మార్స్‌పై శాంపిల్ డిపోను పూర్తి చేసిన నాసాకు చెందిన మిషన్ రోవర్
రోవర్ మార్స్‌పై శాంపిల్ డిపో నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. రోవర్ జనవరి 29న 10 నమూనా ట్యూబ్‌లలో చివరిదాన్ని వదిలేయడంతో ఈ శాంపిల్ డిపో పూర్తయింది. దాదాపు ఆరు వారాల తర్వాత, రోవర్ ఇప్పుడు మార్స్‌పై జెజెరో క్రేటర్ వద్ద "త్రీ ఫోర్క్స్" ప్రాంతంలో రిపోజిటరీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. రోవర్ డూప్లికేట్ నమూనాలను సేకరిస్తోంది. ఒక సెట్ రోవర్‌లో స్టోర్ అవుతుంది, మరొకటి డిపోను నిర్మించడానికి ఉపయోగించబడుతుంది. మూసివున్న టైటానియం నమూనా ట్యూబ్‌లు మార్టిన్ ఉపరితలంపై ఒక క్లిష్టమైన జిగ్‌జాగ్ నమూనాలో ఉన్నాయి. ప్రతి ట్యూబ్‌కు మధ్య దాదాపు 15 నుండి 50 అడుగుల దూరం ఉండేలా చూసుకున్నారు అప్పుడే వాటిని సురక్షితంగా తిరిగి తీసుకోవవచ్చని భావిస్తున్నారు.
మార్స్ నుండి నమూనాలను 2033 నాటికి భూమికి తిరిగి తీసుకురావచ్చు
ప్రతి 7-అంగుళాల పొడవు గల నమూనా ట్యూబ్, గ్లోవ్ (అడాప్టర్) కలిసి ఉన్న స్థానాన్ని ఖచ్చితంగా మ్యాప్ చేయాలి,అప్పుడే ట్యూబ్‌లపైన దుమ్ము ఉన్నా సరే సులభంగా గుర్తించచ్చు. మార్స్ నుండి నమూనాలను 2033 నాటికి తిరిగి తీసుకురావచ్చు. రోవర్ మార్స్‌పై రాకెట్‌తో నాసా ల్యాండర్‌కు నమూనాలను అందిస్తుంది. రాకెట్ అప్పుడు నమూనాలను మార్స్ కక్ష్యకు పంపుతుంది, అక్కడ అవి ESA ప్రోబ్ ద్వారా భూమికి తిరిగి వస్తాయి. ESA ఆర్బిటర్, NASA ల్యాండర్ వరుసగా 2027 మరియు 2028లో ప్రయోగించాల్సి ఉంది. రోవర్ నమూనాలను తీసుకురాలేకపోతే నమూనా డిపో బ్యాకప్‌గా పనిచేస్తుంది. అటువంటప్పుడు, రెండు చిన్న హెలికాప్టర్లు డిపో నుండి నమూనా ట్యూబ్‌లను సేకరించి వాటిని ఒక్కొక్కటిగా ల్యాండర్‌కు తీసుకువస్తాయి.