Loading...
NASA Voyager 1: చరిత్ర సృష్టించిన వాయేజర్‌-1కు కష్టాలు...ప్రయాణంలో ఆటకం
చరిత్ర సృష్టించిన వాయేజర్‌-1కు కష్టాలు...ప్రయాణంలో ఆటకం

NASA Voyager 1: చరిత్ర సృష్టించిన వాయేజర్‌-1కు కష్టాలు...ప్రయాణంలో ఆటకం

వ్రాసిన వారు Balachander Sharma
Nov 25, 2026
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్షంలో దశాబ్దాలుగా ప్రయాణిస్తున్న నాసా వాయేజర్‌-1 మరోసారి వార్తల్లో నిలిచింది. భూమి నుంచి ఒక కాంతి రోజు దూరాన్ని చేరిన తొలి మానవ నిర్మిత వస్తువుగా చరిత్ర సృష్టించడానికి సిద్ధమైన సమయంలోనే ఈ వ్యోమనౌకలో కమ్యూనికేషన్‌ సమస్య తలెత్తింది. నవంబర్‌ 14న ఈ లోపాన్ని నాసా గుర్తించింది. ఒక కాంతి రోజు అంటే కాంతి వేగంతో ప్రయాణించే రేడియో సంకేతం వ్యోమనౌకను చేరడానికి 24 గంటలు పట్టే దూరం. ఇది సుమారు 1600 కోట్ల మైళ్లు (2600 కోట్ల కిలోమీటర్లు).

Details

సంకేతం వస్తోంది.. సమాచారం మాత్రం లేదు

ప్రస్తుతం వాయేజర్‌-1 నుంచి భూమికి నిరంతర రేడియో సంకేతం అందుతోంది.

అయితే దానిలో వ్యోమనౌక సేకరించిన శాస్త్రీయ, సాంకేతిక సమాచారం ఉండటం లేదు.

దీనిని క్యారియర్‌ సిగ్నల్‌ అంటారు. సంకేతం అందుతున్నందున వ్యోమనౌక యాంటెన్నా పనిచేస్తోందని, భూమి వైపు సరిగ్గా దిశను ఉంచుకోగలుగుతోందని నాసా భావిస్తోంది.

కానీ సమాచారాన్ని సేకరించి పంపాల్సిన ఆన్‌బోర్డ్‌ కంప్యూటర్‌లో సమస్య ఉండొచ్చని అనుమానిస్తోంది. మొత్తం 10 పరికరాల్లో ప్రస్తుతం రెండే పనిచేస్తున్నాయి.

Details

మూడేళ్ల క్రితం కూడా ఇదే తరహా ఇబ్బంది

2023 నవంబర్‌ 14న కూడా వాయేజర్‌-1 ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. అప్పుడు ఫ్లైట్‌ డేటా సబ్‌సిస్టమ్‌లోని ఒక చిప్‌ పనిచేయకపోవడంతో శాస్త్రీయ సమాచారం పంపడం ఆగిపోయింది.

నాసా ఇంజినీర్లు ప్రోగ్రామ్‌లో మార్పులు చేసి సమస్యను పరిష్కరించారు.

తాజాగా తలెత్తిన లోపానికి కూడా అదే కంప్యూటర్‌ కారణమై ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ, నాసా ఇంకా నిర్ధారించలేదు. అక్టోబర్‌ చివర్లో రెండు రోజుల పాటు పూర్తిగా సంకేతాలు నిలిచిపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది.

ADVERTISEMENT

Details

49 ఏళ్ల ప్రయాణం.. ప్రతి ఆదేశానికి 24 గంటలు

1977 సెప్టెంబర్‌లో ప్రయోగించిన వాయేజర్‌-1 కేవలం ఐదేళ్లు పనిచేసేలా రూపొందించారు.

కానీ అంచనాలను మించి దాదాపు 49 ఏళ్లుగా ప్రయాణం కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఎదురైన సమస్యను పరిష్కరించడం కూడా అంత సులభం కాదు.

భూమి నుంచి పంపిన ఆదేశం వ్యోమనౌకకు చేరడానికి 24 గంటలు, అక్కడి నుంచి సమాధానం తిరిగి రావడానికి మరో 24 గంటలు పడుతుంది.

వాయేజర్‌-1తో పాటు దాని జంట వ్యోమనౌక వాయేజర్‌-2 కూడా సౌర కుటుంబం వెలుపల అంతరిక్షాన్ని అధ్యయనం చేస్తున్నాయి.

వాయేజర్‌-1 2012లో, వాయేజర్‌-2 2018లో సూర్యుడి ప్రభావ పరిధిని దాటి నక్షత్రాల మధ్య ప్రాంతంలోకి ప్రవేశించాయి.

ADVERTISEMENT