Page Loader
జాతీయ సైన్స్ దినోత్సవం 2023: నోబెల్ బహుమతికి కారణమైన సీవీ రామన్ సముద్ర ప్రయాణం
జాతీయ సైన్స్ దినోత్సవం 2023

జాతీయ సైన్స్ దినోత్సవం 2023: నోబెల్ బహుమతికి కారణమైన సీవీ రామన్ సముద్ర ప్రయాణం

వ్రాసిన వారు Sriram Pranateja
Feb 28, 2023
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీవీ రామన్.. భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఈయన ప్రయోగాన్ని రామన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. రామన్ ఎఫెక్ట్ ప్రయోగానికి గాను 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఈయన గౌరవార్థం, భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తోంది. 1986 నుండి ప్రతీ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జాతీయ సైన్స్ దినోత్సవం 2023 థీమ్: ప్రపంచ పరిరక్షణ కోసం ప్రపంచ శాస్త్రజ్ఞానం అనే థీమ్ తో ఈ సంవత్సర సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రామన్ ఎఫెక్ట్ అంటే: ఒక కాంతి ప్రవాహం, ద్రవం గుండా ప్రయాణించినపుడు కాంతిలోని కొంతభాగం ద్రవం కారణంగా వేరే రంగులోకి మారుతుంది.

జాతీయ సైన్స్ దినోత్సవం

నోబెల్ బహుమతికి కారణమైన సముద్ర ప్రయాణం

కాంతి తరంగధైర్ఘ్యం మారడం కారణంగా కాంతిలోని కొంతభాగం వేరే రంగులోకి మారుతుంది. ఈ ఆలోచన ఆయనకు సముద్ర ప్రయాణం చేస్తున్న సమయంలో వచ్చింది. 1921లో భౌతికశాస్త్రంలో పరిశోధనలు చేసేందుకు ఇంగ్లాండ్ వెళ్ళారు సీవీ రామన్. అక్కడి నుండి తిరిగి వచ్చేటపుడు సముద్రాన్ని ఆయన బాగా పరిశీలించారు. సముద్రం నీలిరంగులో ఎందుకుందో ఆలోచించారు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్ట్ కి దారితీసింది. సూర్యకిరణాలు సముద్రాన్ని తాకినపుడు కిరణాల్లోని తక్కువ తరంగధైర్ఘ్యం గల నీలివర్ణం, చెల్లా చెదురుగా మారి మన కంటికి చేరుతుంది. అందుకే సముద్రం, నీలిరంగులో కనిపిస్తుంది. రామన్ ఎఫెక్ట్ ప్రయోగం, ఆ తర్వాత ఎన్నో ప్రయోగాలకు దారి తీసింది. సీవీ రామన్ కు 1930లో నోబెల్ బహుమతి తెచ్చిపెట్టింది.