LOADING...
AI-generated: కొత్త వెబ్‌సైట్లలో 35% AI సృష్టించినవే.. తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు
కొత్త వెబ్‌సైట్లలో 35% AI సృష్టించినవే.. తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు

AI-generated: కొత్త వెబ్‌సైట్లలో 35% AI సృష్టించినవే.. తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 28, 2026
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఇంటర్నెట్ ఆర్కైవ్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం 2022 తర్వాత ప్రారంభమైన కొత్త వెబ్‌సైట్లలో దాదాపు మూడో వంతు AI ద్వారా తయారయ్యాయని వెల్లడైంది. "The Impact of AI-generated Text on the Internet" అనే పేపర్‌లో ఈ వివరాలు వెల్లడించారు. AI కంటెంట్ పెరగడం వల్ల వెబ్‌లో భాష కొంత పాజిటివ్‌గా మారినా, వైవిధ్యం మాత్రం తగ్గిందని అధ్యయనం చెబుతోంది. 'డెడ్ ఇంటర్నెట్ థియరీ' ప్రేరణతో ఈ పరిశోధన చేపట్టారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఇంటర్నెట్‌లో చాలా భాగం ఇప్పుడు బాట్స్ మధ్య సంభాషణలుగా మారిందనే అభిప్రాయం ఉంది.

వివరాలు 

ఇంటర్నెట్‌లో ఇప్పుడు AI కీలక పాత్ర

పరిశోధకుల అంచనాల ప్రకారం 2025 మధ్య నాటికి సుమారు 35% కొత్త వెబ్‌సైట్లు పూర్తిగా లేదా కొంతవరకు AI ఆధారంగా తయారయ్యాయి. స్టాన్‌ఫోర్డ్‌కు చెందిన AI రీసెర్చర్ జోనాస్ డోలెజల్ మాట్లాడుతూ కేవలం మూడు సంవత్సరాల్లోనే AI ప్రభావం అంతగా పెరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మానవ ప్రభావంతో దశాబ్దాలుగా పెరిగిన ఇంటర్నెట్‌లో ఇప్పుడు AI కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో AI కంటెంట్ ప్రభావంపై ఆరు ముఖ్య అంశాలను పరీక్షించారు. 2022 ఆగస్టు నుంచి 2025 మే వరకు సేకరించిన వెబ్‌సైట్లను "Pangram v3" అనే AI డిటెక్షన్ సాఫ్ట్‌వేర్‌తో విశ్లేషించారు.

వివరాలు 

ఫ్యాక్ట్ చెకర్స్‌తో కూడా పరీక్షలు

AI కారణంగా తప్పుడు సమాచారం పెరిగిందా అన్నది తెలుసుకోవడానికి ఫ్యాక్ట్ చెకర్స్‌తో కూడా పరీక్షలు చేశారు. ఆశ్చర్యకరంగా, AI వల్ల ఇంటర్నెట్ పూర్తిగా తప్పుదోవ పట్టిందనే అభిప్రాయం నిజం కాలేదు. కానీ భాషా వైవిధ్యం తగ్గి, కంటెంట్ పాజిటివ్‌గా మారినట్టు తేలింది. రానున్నరోజుల్లో AI వెబ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో మరింత లోతుగా అధ్యయనం చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే ఏ రకమైన వెబ్‌సైట్లు, ఏ భాషల్లో ఎక్కువగా AI ప్రభావం ఉందో కూడా పరిశీలించనున్నారు.

Advertisement