Netflix: పిల్లల కోసం 'ప్లేగ్రౌండ్' గేమ్ యాప్ విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్.. ఆఫ్‌లైన్‌లో కూడా ఆడొచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్(Netflix)గేమింగ్ రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. 'నెట్‌ఫ్లిక్స్ ప్లేగ్రౌండ్' అనే కొత్త యాప్‌ను విడుదల చేసింది. ఇందులో Peppa Pig, Sesame Street వంటి పిల్లలకి ఇష్టమైన పాత్రల ఆధారంగా గేమ్స్ ఉంటాయి. ఈ యాప్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగానే అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎలాంటి ప్రకటనలు లేదా ఇన్-యాప్ కొనుగోళ్లు ఉండవు. ముఖ్యంగా 8 సంవత్సరాల లోపు పిల్లల కోసం దీనిని డిజైన్ చేశారు. మొబైల్ డేటా లేదా వై-ఫై లేకపోయినా ఆఫ్‌లైన్‌లో కూడా ఈ గేమ్స్ ఆడుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ అమెరికా,కెనడా,బ్రిటన్,ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్,న్యూజీలాండ్ దేశాల్లో అందుబాటులో ఉంది.
వివరాలు
పార్టీ గేమ్స్‌తో టీవీ గేమింగ్‌లోకి..
ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. iOS, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ యాప్ పనిచేస్తుంది. పిల్లలు తమకు ఇష్టమైన కథల్లోనే పాల్గొనే అనుభవాన్ని ఇది ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే 2021లో గేమింగ్ రంగంలోకి అడుగుపెట్టిన నెట్‌ఫ్లిక్స్, ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కొన్ని ప్రాజెక్టులను తగ్గించింది. ఈ క్రమంలో పలు గేమింగ్ స్టూడియోలను కూడా మూసివేసింది. అయితే గత ఏడాది చివర్లో గ్రూప్‌గా ఆడుకునే పార్టీ గేమ్స్‌తో టీవీ గేమింగ్‌లోకి మళ్లీ ప్రవేశించింది. ఇప్పుడు కొత్తగా పిల్లల కోసం ఈ ప్లేగ్రౌండ్ యాప్‌ను తీసుకురావడం గమనార్హం.