గూగుల్ లో ఈ విషయాలు సెర్చ్ చేస్తే మీ పని అంతే!
టెక్నాలజీ రంగంలో 2023 ఒక ముఖ్యమైన సంవత్సరం. ఇంటర్నెట్ టెక్నాలజీల అభివృద్ధి ఆన్‌లైన్ ద్వేషపూరిత-సమూహ కార్యకలాపాలకు లేదా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు, సమాచారానికి కారణం అయింది. గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్‌లలో చేసిన శోధనలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ఇది సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తుంది ఒకవేళ ప్రభుత్వం నిషేదించిన వాటి కోసం సెర్చ్ చేస్తే కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. గూగుల్ లేదా ఇతర సెర్చ్ ఇంజిన్‌లలో సెర్చ్ చేయకూడని విషయాలు: దేశ భద్రతకు సంబంధించి లేదా హాని తలపెట్టాలి అనే సమాచారాన్ని వెతకడం వల్ల ప్రభుత్వ భద్రతా అధికారులు లేదా సెర్చ్ ఇంజన్ సిబ్బంది రాడార్‌లో మిమ్మల్ని గమనించడం మొదలుపెడతారు. హాని కలిగించే సమాచారం కోసం శోధిస్తున్నట్లయితే, నిస్సందేహంగా సమస్యలలో ఇరుక్కున్నట్టే.
ఆయుధాల కోసం సెర్చ్ చేసినా ప్రమాదమే
పిల్లలతో కూడిన అశ్లీలత: భారతదేశంతో సహా ప్రపంచంలో ఎక్కడైనా పిల్లల అశ్లీలతకు సంబంధించిన కంటెంట్ కోసం వెతకడం చట్టవిరుద్ధం. క్రిమినల్ యాక్టివిటీ-సంబంధిత ప్రశ్నలు: ఏదైనా ఆయుధాన్ని ఎలా తయారు చేయాలి లేదా ఎవరినైనా గాయపరచడం వంటి ఏదైనా నేర సంబంధిత సమాచారాన్ని వెతికితే ఇబ్బందుల్లో పడవచ్చు. డ్రగ్స్ సంబంధింత సమాచారం వెతకడం కూడా నేరమే. అబార్షన్-సంబంధిత నిబంధనల కోసం వెతకడం: తరచుగా అబార్షన్ కోసం చూస్తున్నట్లయితే, అది తీవ్రమైన సమస్యలను తెచ్చిపెడుతుంది. భారతదేశంలోని నియమ నిబంధనల ద్వారా అది జరగాలి కానీ అనైతిక పద్ధతుల కోసం వెతుకుతున్నట్లయితే, బాధ్యతాయుతమైన అధికారుల నిఘాలో పడే ప్రమాదం ఉంది.