
Aadhaar: కొత్త ఆధార్ యాప్ ప్రారంభం.. క్యూఆర్ కోడ్‌తో తక్షణ వెరిఫికేషన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటివరకు ధ్రువీకరణ అవసరాల కోసం ఆధార్ కార్డు లేదా దాని జిరాక్స్ ప్రతిని తీసుకెళ్తుంటాం.
అయితే, ఇకపై అలాంటిది అవసరం లేకుండా, ఆధార్ ధ్రువీకరణను సులభతరం చేసే నూతన ఆధార్ యాప్‌ను కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఆవిష్కరించారు.
ఈ యాప్‌లో క్యూఆర్ కోడ్ ఆధారంగా తక్షణ ధ్రువీకరణతో పాటు, రియల్ టైమ్ ఫేస్ వెరిఫికేషన్ వంటి ఆధునిక ఫీచర్లు ఉంటాయి.
ధ్రువీకరణ అవసరమయ్యే చోట ఒక క్యూఆర్ కోడ్ ప్రదర్శించబడుతుంది. దాన్ని యూజర్ తన ఆధార్ యాప్ ఉపయోగించి స్కాన్ చేస్తే, వెంటనే ధ్రువీకరణ పూర్తి అవుతుంది.
ఇది యూపీఐ చెల్లింపుల్లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసే విధానాన్ని పోలి ఉంటుంది.
వివరాలు
ప్రక్రియ పూర్తిగా సురక్షితం
ఈ ప్రక్రియ పూర్తిగా సురక్షితంగా ఉండి, ఎంతో సులభంగా సాగుతుందని మంత్రి వైష్ణవ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో తెలిపారు.
ఈ యాప్ ప్రస్తుతం బీటా దశలో పరీక్షలలో ఉంది. ఒకసారి ఆ పరీక్షలు విజయవంతంగా పూర్తయితే, దేశవ్యాప్తంగా ఈ యాప్‌ను అమల్లోకి తేవడం జరుగుతుంది.
ప్రజలు తమ వ్యక్తిగత ఫోన్ల ద్వారానే తమ ఆధార్ వివరాలను భద్రతతో పంచుకునే అవకాశం పొందుతారని మంత్రి వివరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అశ్విని వైష్ణవ్ చేసిన ట్వీట్
New Aadhaar App
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 8, 2025
Face ID authentication via mobile app
❌ No physical card
❌ No photocopies
🧵Features👇 pic.twitter.com/xc6cr6grL0