Page Loader
WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. మీ ఆలోచనలకు అనుగుణంగా చాట్‌లను ఫిల్టర్ చేయండి!
వాట్సప్‌లో కొత్త ఫీచర్.. మీ ఆలోచనలకు అనుగుణంగా చాట్‌లను ఫిల్టర్ చేయండి!

WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. మీ ఆలోచనలకు అనుగుణంగా చాట్‌లను ఫిల్టర్ చేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2024
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ మెసేజింగ్ యాప్ వాట్సాప్, యూజర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే అనేక సదుపాయాలతో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిన ఈ యాప్, తాజాగా 'కస్టమ్ లిస్ట్' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చినట్లు చాట్‌లను ఫిల్టర్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వాట్సప్‌ను ఓపెన్ చేయగానే అనేక కాంటాక్ట్స్ కనిపిస్తాయి. అందులో వ్యక్తిగత, వృత్తిపరమైన, లేదా ఫ్రెండ్స్ వంటి అన్ని చాట్‌లు మిళితమవుతాయి. అవసరమైన వ్యక్తితో చాట్ చేయాలంటే ఈ పెద్ద జాబితాలో వెతకాల్సి వస్తుంది. ఇకపై వాట్సప్ తీసుకొచ్చిన 'కస్టమ్ లిస్ట్' ద్వారా, ఫ్యామిలీ, ఆఫీస్, ఫ్రెండ్స్ వంటి చాట్‌లను సులభంగా ఫిల్టర్ చేసుకోవచ్చు.

Details

త్వరలో అందుబాటులోకి ఫీచర్ 

ఈ కొత్త సదుపాయం ద్వారా కమ్యూనికేషన్ అనుభవం మరింత మెరుగుపడనుంది. ప్రస్తుతం, వాట్సప్ ఓపెన్ చేసినప్పుడు వెబ్‌లో 'ఆల్', 'అన్‌రీడ్', 'ఫేవరెట్స్', 'గ్రూప్స్' వంటి ఫిల్టర్లు కన్పిస్తున్నాయి. త్వరలో, వీటి పక్కన '+' ఐకాన్‌ను కూడా జోడించనున్నది. దాని సాయంతో కొత్త లిస్ట్‌లను సృష్టించుకోవచ్చు. ఫిల్టర్‌ను లాంగ్ ప్రెస్ చేసి ఎడిట్ చేసుకునే సదుపాయమూ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన వాట్సప్ ఛానల్ ద్వారా స్వయంగా ప్రకటించారు. సంబంధిత స్క్రీన్ షాట్‌ను పంచుకుంటూ, చాట్ ఫిల్టర్ల లిస్ట్‌ను చూపించారు. రోలౌట్ అవుతున్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.