iPhone 18: ఐఫోన్ 18 సిరీస్ లాంఛ్.. ఫేక్ డీల్స్‌తో మోసాలకు తెరతీసిన స్కామర్లు
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నారా? అయితే ఆన్‌లైన్‌లో కనిపించే ఆకర్షణీయమైన ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త ఐఫోన్ మోడల్స్ విడుదలైన సందర్భాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లను సృష్టిస్తున్నట్లు సెక్యూరిటీ రీసెర్చర్లు గుర్తించారు. డిస్కౌంట్లు, ప్రీ-ఆర్డర్లు, ఎర్లీ యాక్సెస్ పేరుతో వినియోగదారులను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆపిల్ ఇటీవల కొత్త ఐఫోన్ మోడల్స్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడల్స్‌కు సెప్టెంబర్ 12, 2026 నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అధికారిక ఆపిల్ స్టోర్‌తో పాటు క్రోమా వంటి అధీకృత రిటైల్ భాగస్వాముల వద్ద కూడా వీటిని బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 18 నుంచి ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.
వివరాలు
సెప్టెంబర్ 9న కొత్త ఐఫోన్ సిరీస్ విడుదల
కొత్త ఐఫోన్ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకున్న స్కామర్లు.. నకిలీ షాపింగ్ వెబ్‌సైట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రీ-ఆర్డర్ పీరియడ్‌లో ప్రత్యేక డిస్కౌంట్లు, ముందస్తు యాక్సెస్ లభిస్తుందని నమ్మిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.
సెప్టెంబర్ 9న ఆపిల్ కొత్త ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేసింది.
ఇందులో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా పరిచయం చేసింది.
ప్రో మోడల్స్‌కు సంబంధించి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమైనప్పటికీ.. ఫోల్డబుల్ ఐఫోన్ బుకింగ్స్ ఆలస్యంగా మొదలుకానున్నాయి.
వివరాలు
డొమైన్ల రిజిస్ట్రేషన్లలో పెరుగుదల
కొత్త ఐఫోన్ సిరీస్ విడుదల నేపథ్యంలో "Apple", "iPhone" పదాలు ఉన్న డొమైన్ల సంఖ్య పెరిగినట్లు సెక్యూరిటీ రీసెర్చర్లు గుర్తించారు.
కొత్త మోడల్స్ విడుదలైన 24 గంటల్లోనే ఆ పేర్లతో 200కు పైగా డొమైన్లు రిజిస్టర్ అయినట్లు 'ది గార్డియన్' (The Guardian) కథనంలో పేర్కొన్నారు.
గత నాలుగు ఐఫోన్ మోడల్స్ విడుదలైన సందర్భాల్లో ఇలాంటి డొమైన్ రిజిస్ట్రేషన్లు కనిపించలేదని నివేదిక వెల్లడించింది.
తాజా ఐఫోన్ మోడల్స్ పేర్లు, అధికారిక స్పెసిఫికేషన్లను పోలిన సమాచారంతో నకిలీ వెబ్‌సైట్లను రూపొందిస్తున్నట్లు 'ఫస్ట్‌పోస్ట్'(Firstpost) కథనం పేర్కొంది.
దీంతో అధికారిక ఆపిల్ వెబ్‌సైట్‌నే సందర్శిస్తున్నామని భావించి కొందరు వినియోగదారులు మోసపోయే అవకాశం ఉంది.
వివరాలు
స్కామ్ ఎలా జరుగుతుందంటే..
కొత్త ఐఫోన్ మోడల్స్ కొనాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని.. "Apple", "iPhone" పదాలు ఉండేలా నకిలీ రిటైలర్ పేర్లతో వెబ్‌సైట్లను సృష్టిస్తారు.
అవి నిజమైన రిటైలర్ వెబ్‌సైట్లుగా కనిపించేలా ప్రొడక్ట్ ఫొటోలు, సాంకేతిక ఫీచర్లు, కస్టమర్ రివ్యూలను కూడా అందులో పొందుపరుస్తారు.
కొన్ని సందర్భాల్లో కృత్రిమ మేధ (AI) సాయంతో అసలైన రిటైలర్ వెబ్‌సైట్‌ను పోలిన డిజైన్‌ను రూపొందిస్తున్నారు.
ఆ తర్వాత తక్కువ ధరలకు ఐఫోన్ లభిస్తుందని, పరిమిత స్టాక్ మాత్రమే ఉందని, వెంటనే బుక్ చేసుకోవాలని చెబుతూ వినియోగదారులపై ఒత్తిడి పెంచుతారు.
వివరాలు
స్కామ్ ఎలా జరుగుతుందంటే..
కొత్త ఐఫోన్ మోడల్స్ అధికారికంగా విక్రయానికి రాకముందే "Buy Now" వంటి ఆప్షన్లతో నకిలీ వెబ్‌సైట్లు ఆర్డర్లు స్వీకరిస్తుంటాయి.
ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత వినియోగదారులు పేమెంట్ చేస్తారు. అయితే చెల్లింపు పూర్తయినప్పటికీ ఫోన్ అందకపోవచ్చు.
అంతేకాకుండా, మోసగాళ్లకు వ్యక్తిగత వివరాలు లేదా బ్యాంకింగ్ సమాచారం చేరే ప్రమాదం కూడా ఉంటుంది.
అందువల్ల కొత్త ఐఫోన్ కొనుగోలు చేసేటప్పుడు అధికారిక ఆపిల్ స్టోర్ లేదా విశ్వసనీయ రిటైల్ భాగస్వాములనే ఆశ్రయించడం మంచిది.