Page Loader
Earth: శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం.. విమానాశ్రయ రాడార్లు ఎలియన్లకూ వినిపిస్తాయా? 
శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం.. విమానాశ్రయ రాడార్లు ఎలియన్లకూ వినిపిస్తాయా?

Earth: శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం.. విమానాశ్రయ రాడార్లు ఎలియన్లకూ వినిపిస్తాయా? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 10, 2025
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన వాయుమార్గాల్లో ఉపయోగించే ముఖ్యమైన రాడార్ పరికరాలు భూమి స్థానాన్ని ఎలియన్‌లకు (గ్రహాంతర మేధావులకు) తెలియజేస్తున్నాయనే ఆసక్తికర అంశాన్ని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ రాడార్ల నుంచి నిక్షిప్తమవుతున్న ఎలెక్ట్రోమాగ్నెటిక్‌ తరంగాలు అంతరిక్షంలో దూరంగా ప్రయాణిస్తూ, సుమారు 200 లైట్‌ ఇయర్స్‌ (ప్రకాశ సంవత్సరాలు) దూరంలోని నాగరికతలకు కూడా భూమి స్థానాన్ని వెల్లడించగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విశ్లేషణను రాయల్‌ ఆస్ట్రోనామికల్‌ సొసైటీ 2025 సమావేశంలో శాస్త్రవేత్తలు ప్రజెంట్ చేశారు.

Details

బర్నార్డ్ స్టార్‌, ఏయూ మైక్రోస్కోపియిలపై ప్రయోగం 

శాస్త్రవేత్తల బృందం బర్నార్డ్ స్టార్‌, ఏయూ మైక్రోస్కోపి వంటి సమీప నక్షత్రాల నుంచి భూమి వదలిన రాడార్ సిగ్నల్స్ ఎలా కనిపిస్తాయో సిమ్యులేట్‌ చేశారు. వీటి ద్వారా ఇలా గ్రహాంతర మేధావులు మన పథకాల్ని పసిగట్టగలరా అన్న దానిపై విశ్లేషణ చేశారు. విమానాశ్రయాల్లో వినియోగించే రాడార్లు 2×10¹⁵ వాట్ల శక్తితో సంకేతాలను ప్రసారం చేస్తుంటాయి. ఇవి వర్జీనియాలోని గ్రీన్‌బ్యాంక్ టెలిస్కోప్‌ వంటి శక్తివంతమైన రేడియో టెలిస్కోప్స్‌తో సులభంగా గుర్తించగలమని వారు పేర్కొన్నారు.

Details

మిలిటరీ రాడార్ల సిగ్నల్స్‌ ఇంకా శక్తివంతం

అంతేకాదు, మిలిటరీ రాడార్ వ్యవస్థల విషయంలో పరిస్థితి మరింత తేడాగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రాడార్లు మరింత శక్తివంతమైన సిగ్నల్స్‌ను పంపిస్తాయి. వాటి శక్తి 1×10¹⁴ వాట్లకు చేరుకోగలదు. అంతరిక్షంలోని కొన్ని ప్రాంతాల నుంచి చూస్తే, ఇవి మానవ నిర్మితమైనవేనన్న స్పష్టమైన సంకేతాలుగా కనిపిస్తాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం... ఏ గ్రహానైనా ఇలాంటి రాడార్ సిగ్నల్స్‌ ఉంటే, అక్కడ జీవం ఉందనే ఉమ్మడి గుర్తుగా భావించవచ్చని తేలింది. ఇది భవిష్యత్తులో గ్రహాంతర నాగరికతల అన్వేషణకు దారి చూపే కీలక ఆధారంగా మారవచ్చని అభిప్రాయపడ్డారు.