LOADING...
Nisar satellite: రేపే నింగిలోకి 'నిసార్'.. ప్రతి 12 రోజులకు భూమిని స్కాన్ చేసే అద్భుతం!
రేపే నింగిలోకి 'నిసార్'.. ప్రతి 12 రోజులకు భూమిని స్కాన్ చేసే అద్భుతం!

Nisar satellite: రేపే నింగిలోకి 'నిసార్'.. ప్రతి 12 రోజులకు భూమిని స్కాన్ చేసే అద్భుతం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2025
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూమిని అణువణువుగా స్కాన్ చేయనున్న నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి ముహూర్తం దగ్గరపడింది. భారత్, అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ అత్యాధునిక ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ద్వారా నిసార్‌ను ప్రయోగించనున్నారు. ఇప్పటికే మంగళవారం మధ్యాహ్నం 2.10కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

Details

 భూమిపై ప్రతిచోటా నిసార్ నిగాహీ 

ఇస్రో-నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2,392 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహం ప్రతీ 12 రోజులకు భూమిని పూర్తిగా స్కాన్ చేయగలదు. అడవులు, పంటలు, కొండలు, మైదానాలు, జల వనరులు, మంచు ప్రాంతాల నుంచి పర్వత విపత్తులు వరకూ అన్నీ ఇందులో వస్తాయి. నాసా రూపొందించిన ఎల్-బ్యాండ్, ఇస్రో అభివృద్ధి చేసిన ఎస్-బ్యాండ్ రాడార్లను దీనిలో అమర్చారు. రూ.11,200 కోట్ల ప్రాజెక్ట్‌లో ఇస్రో పాత్ర కీలకం ప్రాజెక్ట్ మొత్తం వ్యయం సుమారు రూ.11,200 కోట్లు కాగా, ఇస్రో వాటా కింద జరిగిన పనులకు కేవలం రూ.800 కోట్లు మాత్రమే ఖర్చవడం గమనార్హం. భారత ఇంజనీరింగ్ నైపుణ్యంతో అధిక నాణ్యతను తక్కువ వ్యయంతో సాధించగలగడం ఇందుకు కారణం

Details

కక్ష్య ప్రయాణం తర్వాత 90 రోజుల్లో సేవలు ప్రారంభం

747 కిలోమీటర్ల ఎత్తులోని సూర్య అనువర్తిత కక్ష్యలోకి నిసార్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగం అనంతరం 90 రోజుల్లో ఇది కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. రాత్రి, పగలు తేడా లేకుండా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది భూమిని స్కాన్ చేయగలదు. విపత్తుల ముందస్తు హెచ్చరికలు నిసార్ నుంచే నిసార్ ప్రతిసారి 240 కిలోమీటర్ల వెడల్పులో ఉన్న భూభాగాన్ని స్కాన్ చేస్తుంది. ఒక్కసారి స్కాన్ చేసినప్పుడు దాని స్పష్టత 10 మీటర్ల స్థాయిలో ఉంటుంది. ఒక్క అంగుళం నేల కుంగినా గుర్తించగలదు. అగ్నిపర్వతాలు, కొండచరియలు, కార్చిచ్చు, సునామీలు, తుపాన్లు వంటి ప్రకృతి విపత్తులపై ముందస్తు సమాచారం ఇస్తుంది. వంతెనలు, డ్యామ్‌లలోని లోపాలూ గుర్తించగలదు.

Details

రైతులకు సహాయకారిగా నిసార్

అటవీ విస్తీర్ణంలో మార్పులు, పచ్చదనంలో హెచ్చుతగ్గులు, పంటల ఎదుగుదల, నేల తేమ స్థాయిలు వంటి అంశాలపై నిసార్ స్పష్టమైన సమాచారం ఇస్తుంది. దీని ద్వారా ఉపరితల జలాలు, నీటి వనరుల పరిస్థితులు కూడా అంచనా వేయవచ్చు. రైతులు సాగుకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. నాసా ప్రశంసలు నిసార్ ఒక సంచలనాత్మక ఉపగ్రహమని నాసా పేర్కొంది. వాతావరణం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, భూమిపై జరిగిన 1 సెంటీమీటరు మార్పును కూడా గుర్తించే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉందని నాసా ఎర్త్ సైన్స్ డైరెక్టర్ కరెన్ సెయింట్ జర్మైన్ చెప్పారు. ఇంతవరకు ఎన్నడూ లేనివిధంగా అమెరికా-భారతదేశాలు కలసి భూమిని విశ్లేషించేందుకు రూపొందించిన అత్యంత శక్తిమంతమైన ఉపగ్రహంగా నిసార్ నిలుస్తుందని తెలిపారు.