భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన నోకియా C12 ప్లస్
నోకియా C12 ప్లస్ ఇప్పుడు భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. హ్యాండ్‌సెట్ ధర రూ.7,999తో మార్కెట్లోకి వచ్చింది. అయితే, ఇదే ధరకు ఇతర స్మార్ట్‌ఫోన్‌లు మెరుగైన ఫీచర్స్ అందిస్తున్నాయి. నోకియా C12 ప్లస్ UNISOC SC9863A1 ప్రాసెసర్, 2GB RAM, 32GB స్టోరేజ్, 4,000mAh బ్యాటరీతో వస్తుంది. ఫీచర్ ఫోన్ నుండి టచ్‌స్క్రీన్ ఫోన్ కు మారాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, నోకియా C12 ప్లస్ కన్నా మెరుగ్గా ఉన్న ఈ ఫోన్లను చూడండి Moto e13: ప్రారంభ ధర రూ. 6,999, ఇది 4GB RAM, 64GB స్టోరేజ్, 5,000mAh బ్యాటరీతో UNISOC T606 చిప్ సపోర్ట్ తో వస్తుంది.
నోకియా C12 ప్లస్ ధరకు ఇంచుమించుగా వస్తున్న ఫోన్లు ఎక్కువ స్టోరేజ్ ను అందిస్తున్నాయి
Redmi 12C: ప్రారంభ ధర రూ. 8,999, ఇది Helio G85 చిప్‌సెట్, 6GB RAM వరకు, 128GB వరకు స్టోరేజ్, 5,000mAh బ్యాటరీనితో వస్తుంది. Infinix Hot 30i: ధర రూ. 8,999, ఇది Helio G37 చిప్, 8GB RAM, 128GB స్టోరేజ్, 5,000mAh బ్యాటరీతో వస్తుంది. Samsung Galaxy F04: ధర రూ. 9,249, ఇది Helio P35 చిప్ 4GB RAM, 64GB స్టోరేజ్, 5,000mAh బ్యాటరీతో ఆన్‌బోర్డ్‌లో ఉంది. ఇందులో ఎక్స్పాండేబుల్ RAMతో పాటు, ఎక్స్పాండేబుల్ 1TB స్టోరేజ్ కూడా ఉంది.