Nothing Phone 3a: నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్ రివీల్.. అదిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన డిజైన్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ (Nothing) నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి.
నథింగ్ 3ఏ (Nothing Phone 3a) పేరుతో ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు భారత మార్కెట్‌లో లాంచ్ కాబోతోంది.
ఈ సిరీస్‌లో నథింగ్ ఫోన్ 3ఏ, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో రెండు వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయి.
గతంలో విడుదలైన నథింగ్ ఫోన్ 2ఏ సిరీస్‌కు మంచి ఆదరణ లభించడంతో, ఇప్పుడు మరింత అధునాతన ఫీచర్లతో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది.
Details
నథింగ్ ఫోన్ (3ఏ) సిరీస్ ఫీచర్లు
- డిజైన్: హై-ఎండ్ వేరియంట్ల మాదిరిగానే స్టైలిష్ లుక్
కలర్స్: బ్లాక్, వైట్ - కెమెరా: మూడు బ్యాక్ కెమెరాలు (పెరిస్కోప్ టెలీఫొటో లెన్స్), గ్లిప్ ఇంటర్‌ఫేస్
50MP ప్రైమరీ కెమెరా
50MP టెలీఫొటో కెమెరా
8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా
32MP సెల్ఫీ కెమెరా
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 7s Zen3
డిస్‌ప్లే: 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
బ్యాటరీ: 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Details
స్టోరేజ్
నథింగ్ ఫోన్ 3ఏ: 8GB RAM / 128GB స్టోరేజ్
నథింగ్ ఫోన్ 3ఏ ప్రో: 12GB RAM / 256GB స్టోరేజ్
ధర: రూ.30వేల నుంచి ప్రారంభం
నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్ తన ఆకట్టుకునే డిజైన్, శక్తివంతమైన ఫీచర్లతో మార్కెట్లో పెద్ద హిట్ అవుతుందేమో వేచి చూడాలి!