Nothing Phone 3a: మార్చి 4న మార్కెట్లోకి నథింగ్ ఫోన్ 3ఏ.. ఫస్ట్ లుక్ చూశారా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ మరో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించింది.
ఇప్పటికే నథింగ్ ఫోన్ 2ఏ, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ సిరీస్‌కు మంచి ఆదరణ లభించడంతో, కంపెనీ త్వరలో నథింగ్ ఫోన్ 3ఏ లాంచ్‌కు సిద్ధమైంది. తాజాగా, ఈ కొత్త ఫోన్ లుక్‌ను రివీల్ చేసింది.
మార్చి 4న నథింగ్ ఫోన్ 3ఏ గ్రాండ్ లాంచ్!
గతంలో లాంచ్ చేసిన హై-ఎండ్ వేరియంట్ల మాదిరిగానే నథింగ్ ఫోన్ 3ఏ స్టైలిష్ డిజైన్‌తో వస్తోంది. ఇందులో మూడు కెమెరాలు, గ్లిప్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది.
ఈ డివైస్ నలుపు, తెలుపు రంగుల్లో అందుబాటులోకి రానుంది.
Details
Nothing Phone 3a ముఖ్య విశేషాలు
డిస్‌ప్లే: 6.72 అంగుళాల AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: Qualcomm Snapdragon 7s Gen 3
కెమెరా సెటప్
50MP ప్రైమరీ కెమెరా
50MP టెలిఫోటో కెమెరా
8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా
32MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 5,000mAh, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
నథింగ్ ఫోన్ 3ఏ టెక్ ప్రియులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. మార్చి 4న లాంచ్ కానున్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో వేచిచూడాలి!