LOADING...
Nutella: నాసా ఆర్టెమిస్-2 మిషన్‌లో న్యుటెల్లా.. వైరల్‌గా మారిన వీడియో
నాసా ఆర్టెమిస్-2 మిషన్‌లో న్యుటెల్లా.. వైరల్‌గా మారిన వీడియో

Nutella: నాసా ఆర్టెమిస్-2 మిషన్‌లో న్యుటెల్లా.. వైరల్‌గా మారిన వీడియో

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2026
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 యాత్రలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. చంద్రుడిని చుట్టి రావడానికి బయలుదేరిన ఈ మిషన్‌లో వ్యోమగాములతో పాటు న్యుటెల్లా అనే ప్రసిద్ధ స్వీట్ స్ప్రెడ్ కూడా ప్రయాణిస్తోంది. అంతరిక్ష నౌకలో జరుగుతున్న కార్యకలాపాలను లైవ్‌స్ట్రీమ్‌ చేస్తుండగా, జీరో గ్రావిటీ పరిస్థితుల్లో వ్యోమగాములతో పాటు న్యుటెల్లా డబ్బా గాల్లో తేలియాడుతూ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను న్యుటెల్లా సంస్థ తమ అధికారిక ఎక్స్‌ (సోషల్ మీడియా) ఖాతాలో షేర్ చేసింది. ఎవరికీ సాధ్యం కాని అంత దూరం ప్రయాణంలో భాగమవడం తమకు గౌరవంగా భావిస్తున్నామని సంస్థ తెలిపింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతోంది.

వివరాలు 

ట్రీట్‌ను ఆస్వాదిస్తున్నాం: నాసా

నెటిజన్లు కూడా ఈ వీడియోపై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. న్యుటెల్లాపై తమ ప్రేమను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. "న్యుటెల్లా అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పడానికి ఇదే ఉదాహరణ" అని ఓ వినియోగదారు కామెంట్ చేశాడు. ఇదిలా ఉండగా, నాసా కెనడీ స్పేస్ సెంటర్ కూడా సరదాగా స్పందించింది. తమ ఆర్టెమిస్ సిబ్బంది చంద్రుడి అందమైన చిత్రాలను క్లిక్ చేస్తుండగా, తాము ఈ మధురమైన ట్రీట్‌ను ఆస్వాదిస్తున్నామని వ్యాఖ్యానించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

న్యుటెల్లా సంస్థ చేసిన ట్వీట్ 

Advertisement