LOADING...
NVIDIA: ఎన్విడియా జిఫోర్స్ నౌ భారత్‌లో లాంచ్.. రూ.999 నుంచి క్లౌడ్ గేమింగ్ సేవలు
ఎన్విడియా జిఫోర్స్ నౌ భారత్‌లో లాంచ్.. రూ.999 నుంచి క్లౌడ్ గేమింగ్ సేవలు

NVIDIA: ఎన్విడియా జిఫోర్స్ నౌ భారత్‌లో లాంచ్.. రూ.999 నుంచి క్లౌడ్ గేమింగ్ సేవలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2026
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ దిగ్గజం ఎన్‌విడియా భారత్‌లో తన క్లౌడ్ గేమింగ్ సర్వీస్ జిఫోర్స్ నౌను అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్ 'ఎర్లీ యాక్సెస్' దశలో ఉండగా, వినియోగదారులు వెయిట్‌లిస్ట్ ద్వారా సేవలను ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. భారత క్లౌడ్ గేమింగ్ మార్కెట్‌లోకి ఎన్‌విడియా ప్రవేశం ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇప్పటికే పలు డివైస్‌లలో గేమ్ స్ట్రీమింగ్ సేవలు అందిస్తున్న ఇతర ప్లాట్‌ఫామ్‌లకు ఇది పోటీగా నిలవనుంది.

వివరాలు

ఎర్లీ యాక్సెస్‌లో రెండు పేడ్ ప్లాన్లు

జిఫోర్స్ నౌ సేవలను ప్రస్తుతం రెండు చెల్లింపు ప్లాన్ల రూపంలో అందిస్తున్నారు. పర్ఫార్మెన్స్ ప్లాన్ : 90 రోజులకు ₹999 అల్టిమేట్ ప్లాన్ : 90 రోజులకు ₹1,999 ఇవే కాకుండా, అదనంగా 200GB పర్సిస్టెంట్ స్టోరేజ్ కోసం ₹299కు ఆప్షన్ అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఉచిత ప్లాన్‌ను కూడా తీసుకురానున్నట్లు NVIDIA వెల్లడించింది. అన్ని డివైస్‌లలో సపోర్ట్ ఈ సర్వీస్ పిసిలు, మాక్‌లు, స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ డివైస్‌లలో పనిచేస్తుంది. అలాగే వినియోగదారుల వద్ద ఇప్పటికే ఉన్న గేమ్ లైబ్రరీలను కూడా సపోర్ట్ చేస్తుంది. స్టీమ్, ఎపిక్ గేమ్స్ స్టోర్, ఎక్స్బాక్స్ గేమ్ పాస్, యుబిసాఫ్ట్ కనెక్ట్, GOG వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లతో ఇది ఇంటిగ్రేట్ అవుతుంది.

వివరాలు

శక్తివంతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

భారత్‌లో ఈ సేవలను NVIDIA RTX 5080 ఆధారిత SuperPOD ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా అందిస్తున్నారు. ఇది బ్లాక్ వెల్ ఆర్కిటెక్చర్‌పై నిర్మితమై, గత తరం సిస్టమ్‌లతో పోలిస్తే సుమారు 2.8 రెట్లు వేగవంతమైన పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అల్టిమేట్ ప్లాన్ ప్రత్యేకతలు అల్టిమేట్ ప్లాన్ వినియోగదారులకు అత్యుత్తమ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. 5K రిజల్యూషన్‌లో 120fps వరకు స్ట్రీమింగ్ NVIDIA Reflex టెక్నాలజీతో 1080p వద్ద 360fpsవరకు లో లేటెన్సీ మోడ్ (30 మిల్లీసెకండ్లలోపు లేటెన్సీ) AV1 ఎన్‌కోడింగ్, AI ఆధారిత వీడియో ఎన్‌హాన్స్‌మెంట్స్, 4:4:4క్రోమా, 10-bit HDRతో Cinematic Quality మోడ్ మొత్తంగా అధునాతన టెక్నాలజీతో జిఫోర్స్ నౌ భారత గేమింగ్ రంగంలో కొత్త అనుభవాన్ని తీసుకురానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement