LOADING...
NVIDIA: 20ఏళ్ల తర్వాత ఎన్విడియా జీఫోర్స్ కంట్రోల్ ప్యానెల్‌కు గుడ్‌బై
20ఏళ్ల తర్వాత ఎన్విడియా జీఫోర్స్ కంట్రోల్ ప్యానెల్‌కు గుడ్‌బై

NVIDIA: 20ఏళ్ల తర్వాత ఎన్విడియా జీఫోర్స్ కంట్రోల్ ప్యానెల్‌కు గుడ్‌బై

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

గేమింగ్ ప్రపంచంలో రెండు దశాబ్దాలుగా ఉపయోగంలో ఉన్న ప్రముఖ జీఫోర్స్ కంట్రోల్ ప్యానెల్ యాప్‌కు నివిడియా గుడ్‌బై చెప్పింది. విండోస్‌లో కొత్త NVIDIA యాప్‌కు మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. పాత కంట్రోల్ ప్యానెల్ యాప్ మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో అందుబాటులోనే ఉన్నా.. ఇకపై కొత్త ఫీచర్లు లేదా అప్‌డేట్లు ఇవ్వబోమని స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితమే ప్రకటన జీఫోర్స్ కంట్రోల్ ప్యానెల్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త యాప్‌ను తీసుకొస్తున్నామని ఎన్విడియా రెండేళ్ల క్రితమే ప్రకటించింది. అప్పటి నుంచి పాత యాప్‌లోని కీలక ఫీచర్లను కొత్త NVIDIA యాప్‌లోకి మార్చింది. ప్రస్తుతం జీఫోర్స్ యూజర్లకు అవసరమైన అన్ని ప్రధాన ఫీచర్లు కొత్త క్లయింట్‌లో అందుబాటులోకి వచ్చాయని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.

వివరాలు 

పాత యాప్ కొనసాగుతుంది.. కానీ అప్‌డేట్లు ఉండవు 

ఇప్పటికే యూజర్ల కంప్యూటర్లలో ఉన్న పాత NVIDIA Control Panel యాప్ అలాగే కొనసాగుతుంది. అయితే యూజర్లు క్లీన్ డ్రైవర్ ఇన్‌స్టాలేషన్ చేస్తే మాత్రమే అది తొలగించే అవకాశం ఉంటుంది. ఇకపై ఈ యాప్‌కు ఎలాంటి కొత్త ఫీచర్లు, బగ్ ఫిక్స్‌లు ఇవ్వబోమని కంపెనీ వెల్లడించింది. అయితే RTX PRO వినియోగదారుల కోసం ప్రొఫెషనల్ ఫీచర్లు పూర్తిగా కొత్త యాప్‌లోకి మారే వరకు కంట్రోల్ ప్యానెల్‌కు సపోర్ట్ కొనసాగుతుందని తెలిపింది.

వివరాలు 

గేమర్లకు ఆల్-ఇన్-వన్ టూల్

కొత్త NVIDIA యాప్ గేమర్లకు ఆల్-ఇన్-వన్ టూల్‌గా మారింది. డ్రైవర్లను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయడం, గేమ్ సెట్టింగ్స్ మేనేజ్ చేయడం, వివిధ DLSS మోడ్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇదే సమయంలో 007 First Light గేమ్ విడుదలకు అనుగుణంగా కొత్త Game Ready డ్రైవర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. తాజా 610.47 డ్రైవర్‌లో Lego Batman: Legacy of the Dark Knight గేమ్‌కు కూడా సపోర్ట్ ఇచ్చింది.

Advertisement