Page Loader
Oneplus: వన్‌ప్లస్‌ కీలక నిర్ణయం.. గ్రీన్‌లైన్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం.. అన్ని స్మార్ట్‌ఫోన్లపై లైఫ్‌టైమ్‌ వారెంటీ 
వన్‌ప్లస్‌ కీలక నిర్ణయం.. గ్రీన్‌లైన్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం

Oneplus: వన్‌ప్లస్‌ కీలక నిర్ణయం.. గ్రీన్‌లైన్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం.. అన్ని స్మార్ట్‌ఫోన్లపై లైఫ్‌టైమ్‌ వారెంటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 06, 2024
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) కీలక నిర్ణయం తీసుకుంది. అమోలెడ్ డిస్‌ప్లే ఫోన్లలో తలెత్తుతున్న గ్రీన్‌లైన్ (Green Line) సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేకమైన 'గ్రీన్‌లైన్ వర్రీ ఫ్రీ సొల్యూషన్'ను శుక్రవారం ప్రకటించింది. భారత వినియోగదారులకు లైఫ్‌టైమ్ వారంటీ అందించే ఈ కార్యక్రమం, స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు నమ్మకాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదనంగా, గ్రీన్‌లైన్ సమస్యను పూర్తిగా నివారించేందుకు మరో రెండు కీలక చర్యలను సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాది తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 13 విడుదలకు ముందుగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

వివరాలు 

పాత మోడళ్లకు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌

చాలా స్మార్ట్‌ఫోన్లలో గ్రీన్‌లైన్ సమస్య ఎదురవుతోంది.ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల తర్వాత డిస్‌ప్లేపై ఆకుపచ్చ గీతలు నిలువుగా కనిపించడాన్నివినియోగదారులు గమనిస్తున్నారు. ఈ సమస్య దాదాపు అన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్లలో ఉంటోంది. అయితే వన్‌ప్లస్ ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందడుగు వేసింది. భారత్‌లో అధిక వేడి,తేమ కారణంగా గ్రీన్‌లైన్ సమస్య ఎక్కువగా కనిపించడంతో,స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలకు పీవీఎక్స్ (PVX) లేయర్‌ను జోడించడం ద్వారా ఈ సమస్యను అరికట్టాలని నిర్ణయించింది. అదనంగా,తమ ఫోన్లను 85డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, 85 శాతం తేమ వాతావరణంలో పరీక్షించేందుకు 80 రకాల క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు నిర్వహించనుంది. అంతేకాకుండా, గ్రీన్‌లైన్ సమస్య ఎదురైన పాత మోడళ్లకు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించిన వన్‌ప్లస్, ఇప్పుడు అన్ని మోడళ్లకూ లైఫ్‌టైమ్ వారెంటీని విస్తరించింది.