OpenAI : పైన్ ల్యాబ్స్ భాగస్వామ్యంతో భారతదేశానికి ఏజెంట్ కామర్స్‌ను తీసుకువచ్చిన ఓపెన్ఏఐ
ఈ వార్తాకథనం ఏంటి
ఓపెన్ఏఐ (OpenAI) భారత్‌లో తన సేవలను విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది. భారతీయ డిజిటల్ పేమెంట్స్ (Digital Payments) సంస్థ Pine Labsతో కలిసి పనిచేయాలని ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence - AI) ప్లాట్‌ఫాం (Platform)ను పేమెంట్ సిస్టమ్ (Payment System)లతో అనుసంధానం చేయనున్నారు. దీంతో "ఏజెంటిక్ కామర్స్"(Agentic Commerce)అనే కొత్త విధానం ప్రారంభం కానుంది. ఈ మోడల్ (Model)లో ఏఐ ఏజెంట్లు (AI Agents) వినియోగదారుల తరఫున ఉత్పత్తులను వెతికి చూపడం,సిఫార్సు చేయడం మాత్రమే కాకుండా, ట్రాన్సాక్షన్లు (Transactions) కూడా పూర్తి చేయగలుగుతాయి. ఈ ఇంటిగ్రేషన్ (Integration)తో Pine Labs, భారత్‌లో ChatGPTకి తొలి పేమెంట్ పార్ట్నర్ (Payment Partner)గా నిలిచింది.
వివరాలు
ఏఐ-ఫస్ట్ కన్స్యూమర్ ఇంటర్నెట్ దిశగా కొత్త అడుగు
ఈ ఒప్పందం ద్వారా Pine Labs నెట్‌వర్క్ (Network)లో ఉన్న వ్యాపారులు ఏఐ ఆధారిత ఇంటర్‌ఫేస్ (AI-led Interface)ల ద్వారా జరిగే లావాదేవీలను ప్రాసెస్ (Process) చేయగలరు. ఈ సందర్భంగా Pine Labs సీఈఓ (CEO) అమ్రిష్ రౌ మాట్లాడుతూ, భవిష్యత్తు "ఏఐ-ఫస్ట్ కన్స్యూమర్ ఇంటర్నెట్" (AI-first Consumer Internet) దిశగా వేగంగా మారుతోందని తెలిపారు. వ్యాపారులు ఏఐ ఆధారిత ప్రపంచంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఆ ట్రాన్సాక్షన్లకు అవసరమైన సపోర్ట్ (Support)ను Pine Labs అందిస్తుందని చెప్పారు.
వివరాలు
ఏఐ ఏజెంట్లు నిర్వహించే పేమెంట్ ట్రాన్సాక్షన్లు
ఇటీవల వినియోగదారులు ఉత్పత్తుల వివరాలు తెలుసుకోవడం, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడం కోసం Gemini,ChatGPT వంటి ప్లాట్‌ఫామ్ (Platform)లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Payment Infrastructure)ను ఏఐ వ్యవస్థలతో కలపడం ద్వారా, డిస్కవరీ (Discovery) నుంచి చెక్‌అవుట్ (Checkout) వరకు సులభమైన మార్పిడి ప్రక్రియను అందించాలనే ఉద్దేశంతో ఈ భాగస్వామ్యం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో, OpenAI ప్రపంచవ్యాప్తంగా ChatGPT కమర్షియల్ యూజ్ కేసులు (Commercial Use Cases)ను విస్తరించే క్రమంలో అడ్వర్టైజింగ్ ఆధారిత మోనిటైజేషన్ (Advertising-led Monetization), ఎంటర్‌ప్రైజ్ ఇంటిగ్రేషన్లు (Enterprise Integrations) వంటి అవకాశాలను పరిశీలిస్తోంది.
వివరాలు
పశ్చిమ ఆసియా,ఆగ్నేయ ఆసియాలో సేవలు
ఏఐ ఆధారిత ఏజెంట్లు స్వయంగా పేమెంట్ ట్రాన్సాక్షన్లు (Payment Transactions) నిర్వహించే సామర్థ్యాన్ని Pine Labs అభివృద్ధి చేస్తోందని అమ్రిష్ రౌ తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ డిప్లాయ్‌మెంట్లు (Deployments) పశ్చిమ ఆసియా (West Asia),ఆగ్నేయ ఆసియా (Southeast Asia) ప్రాంతాల్లోని కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. అంతేకాకుండా సంస్థ అంతర్గతంగా కూడా ఏఐ అడాప్షన్ (AI Adoption)ను వేగవంతం చేసి, ఆపరేషన్లు (Operations)ను సరళీకరించడం, ప్రొడక్ట్ రోలౌట్స్ (Product Rollouts)ను వేగంగా చేపట్టడం లక్ష్యంగా పెట్టుకుంది.