OpenAI AI Processing India: భారత్‌పై ఓపెన్ ఏఐ ఫోకస్...అడ్డంకులు దాటుకొని అడుగులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న వేళ ఓపెన్‌ఏఐ కీలక అడుగు వేసింది. ఇక అర్హత ఉన్న సంస్థలు, డెవలపర్లు కొన్ని API రిక్వెస్ట్‌లను దేశం దాటకుండా భారత్‌లోనే ప్రాసెస్ చేసుకునే అవకాశం లభించనుంది. స్థానిక AI ప్రాసెసింగ్, ఇన్‌ఫరెన్స్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా డేటా దేశంలోనే ఉండాలనే నిబంధనలు ఉన్న సంస్థలకు ఈ సదుపాయం ఉపయోగపడనుంది.
Details
తొలుత GPT-6 Lunaతో ప్రారంభం
ఈ కొత్త స్థానిక AI ప్రాసెసింగ్ సదుపాయం తొలుత GPT-6 Luna మోడల్‌కు అందుబాటులోకి వచ్చింది.
ఇప్పటికే భారత్‌లో డేటా రెసిడెన్సీ ఆప్షన్లను అందిస్తున్న ఓపెన్‌ఏఐ, ఇప్పుడు మోడల్ లెక్కింపులు జరిగే ఇన్‌ఫరెన్స్ ప్రక్రియను కూడా దేశంలోనే నిర్వహించే దిశగా ముందడుగు వేసింది.
ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాల్లో డేటా లోకలైజేషన్ అవసరాలు ఉన్న సంస్థలకు ఇది కీలకంగా మారొచ్చు.
Details
ఏఐ వినియోగానికి అడ్డంకులు తొలగేనా?
భారత్‌లోని కొన్ని సంస్థలు కీలక పనుల కోసం ఏఐని ఉపయోగించేందుకు వెనుకాడుతున్నాయని ఓపెన్‌ఏఐ ఇండియా ఎంటర్‌ప్రైజ్ హెడ్ నితిన్ బావంకులే తెలిపారు.
సమాచారం దేశం బయట ప్రాసెస్ కావాల్సి రావడమే ఇందుకు ఒక కారణమని చెప్పారు.
స్థానిక ఇన్‌ఫరెన్స్‌తో ఈ సమస్య తగ్గడంతో మరిన్ని సంస్థలు ఏఐ టూల్స్‌ను ఉపయోగించే అవకాశం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
Details
డేటా భారత్ దాటకుండా ప్రాసెసింగ్
సపోర్ట్ చేసే వర్క్‌లోడ్స్‌కు API రిక్వెస్ట్‌లు, వాటి సమాధానాలను రూపొందించే మోడల్ కంప్యూటేషన్లు భారత్‌లోనే జరుగుతాయి.
కస్టమర్ కంటెంట్ కూడా దేశంలోనే స్టోర్ అవుతుంది. డాక్యుమెంట్ సమ్మరీ, రిప్లైలు తయారు చేయడం, సమాచార విశ్లేషణ వంటి పనులకు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
Details
API వినియోగదారులకు కొత్త ఆప్షన్
GPT-6 Lunaను Responses, Chat Completions APIs ద్వారా నేరుగా వినియోగించే కస్టమర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
కొత్త API ప్రాజెక్ట్ రూపొందించే సమయంలో స్టోరేజ్, ప్రాసెసింగ్ ప్రాంతంగా భారత్‌ను ఎంచుకోవాలి.
ఈ ఏడాది ప్రారంభంలోనే దేశీయ AI డేటా సెంటర్ సామర్థ్యం కోసం ఓపెన్‌ఏఐ టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం చేసుకుంది.