Paytm: సోలార్ సౌండ్ బాక్స్‌ను లాంచ్ చేసిన పేటీయం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటియం(Paytm)మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా సోలార్ సౌండ్‌బాక్స్‌ను ప్రారంభించింది.
భారత్‌లో మొట్టమొదటిసారిగా సౌరశక్తితో పనిచేసే సౌండ్‌బాక్స్‌ను తీసుకొచ్చింది.
తక్కువ సూర్యకాంతిలో కూడా సులభంగా ఛార్జ్ అయ్యేలా ఈ పరికరాన్ని రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.
వ్యాపారస్తులు విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని పేటీఎం తెలియజేసింది.
పేటీఎం సోలార్ సౌండ్‌బాక్స్ పైభాగంలో సోలార్ ప్యానెల్‌తో డిజైన్ చేయబడింది.
దీన్ని ప్రకాశించే సూర్యకాంతిలో ఉంచితే ఆటోమేటిక్‌గా ఛార్జ్ అవుతుంది.
వివరాలు
4జీ కనెక్టివిటీకి సపోర్ట్
ఇది డ్యూయల్ బ్యాటరీ వ్యవస్థ కలిగి ఉంది, ఒకటి సౌరశక్తితో ఛార్జ్ అవ్వగా, మరొకటి విద్యుత్ ద్వారా ఛార్జ్ చేయొచ్చు.
2-3 గంటల సౌర ఛార్జింగ్‌తో రోజంతా పనిచేయగలదు. అదేవిధంగా, పూర్తిగా విద్యుత్‌తో ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాకప్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
ఈ సౌండ్‌బాక్స్ 4జీ కనెక్టివిటీని కలిగి 3W సామర్థ్యం గల స్పీకర్‌తో వస్తుంది. 11 భాషల్లో ఆడియో నోటిఫికేషన్లకు మద్దతునందిస్తూ, మరింత ఉపయోగకరంగా తయారైంది.