Pentagon: పెంటగాన్ విడుదల చేసిన యూఎఫ్‌వో వీడియోలు.. ఏలియన్లపై మళ్లీ చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) గుర్తు తెలియని ఎగిరే వస్తువులు (యూఎఫ్‌వోలు/యూఏపీలు)కు సంబంధించిన తాజా సమాచారాన్ని బహిర్గతం చేసింది. మొత్తం 40 ఫైళ్లను తన అధికారిక యూఎఫ్‌వో వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. వీటిలో 14 నివేదికలు, 19 వీడియోలు, నాలుగు ఆడియో రికార్డులు, మూడు ఫొటోలు ఉన్నాయి. ఈ వివరాలను పెంటగాన్‌తో పాటు నాసా, సీఐఏ, ఎఫ్‌బీఐ, అమెరికా ఇంధన శాఖ వంటి ప్రభుత్వ సంస్థల నుంచి సేకరించారు. విడుదలైన సమాచారంలో ఎక్కువ భాగం 2010 తర్వాత నమోదైన ఘటనలకు సంబంధించినదే. విడుదలైన పత్రాల్లో 2019లో అమెరికా తూర్పు తీర ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.
వివరాలు
28 ఏళ్ల సర్వీసులో చూడని వస్తువని పైలట్ వ్యాఖ్య
ఆ ఘటనను ప్రత్యక్షంగా గమనించిన ఓ సైనిక పైలట్ తన 28ఏళ్ల వైమానిక దళం,నౌకాదళ సేవలో ఇలాంటి వస్తువును ఎన్నడూ చూడలేదని నివేదికలో పేర్కొన్నాడు. చిన్న పరిమాణంలో ఉన్న ఆ వస్తువు అత్యంత వేగంతో నేరుగా ప్రయాణించిందని,దానిని సుమారు 10 నుంచి 15సెకన్ల పాటు గమనిస్తూ వీడియో కూడా రికార్డు చేసినట్లు తెలిపాడు. అయితే కెమెరాతో జూమ్ చేసి స్పష్టంగా చిత్రీకరించేలోపే అది కెమెరా పరిధిని దాటి క్షణాల్లో కనిపించకుండా పోయిందని వివరించాడు. ఇక మరో నివేదిక ప్రకారం,2015లో టెక్సాస్‌లోని పాంటెక్స్ అణ్వాయుధ కేంద్రం గగనతలంలో కూడా గుర్తు తెలియని ఓ వస్తువు సంచరించినట్లు నమోదైంది. ఆ వస్తువు ఎలాంటి శబ్దం చేయకుండా కదిలిందని అక్కడి భద్రతా సిబ్బంది తమ నివేదికలో వెల్లడించారు.
వివరాలు
చైనా సమీపంలోనూ అనుమానాస్పద వస్తువుల వీడియోలు
అదేవిధంగా 2023, 2025 సంవత్సరాల్లో చైనా సమీపంలోని ఎల్లో సీ, ఈస్ట్ చైనా సీ ప్రాంతాల్లో సైనిక సెన్సార్లకు చిక్కిన అనుమానాస్పద గగన వస్తువుల వీడియోలను కూడా పెంటగాన్ తాజాగా విడుదల చేసింది. అయితే ఇవి గ్రహాంతరవాసులకు చెందిన వాహనాలేనని అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ చేయలేదు. ప్రస్తుతం ఈ ఘటనల స్వభావం, వాటి వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పెంటగాన్ విడుదల చేసిన 40 యూఎఫ్‌వో ఫైళ్లు
The Creepiest UFO Video Ever Released By The White House 👽🛸🇺🇸
— Interstellar (@InterstellarUAP) July 10, 2026
What is that thing? Is it an ALIEN? 😱
DOW-UAP-PR116, Unresolved UAP Report, Atlantic Ocean, 2020 pic.twitter.com/vOabmCyBb6