Philips S7221 5G: ఫిలిప్స్ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్.. రూ.20,499కే 5జీ ఫోన్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫిలిప్స్ (Philips) భారత మార్కెట్‌లోకి తొలిసారిగా స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. S7221 5G పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ధరలను పెంచుతున్న సమయంలో.. ఫిలిప్స్ మాత్రం బడ్జెట్ ధరలో ఈ 5జీ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఈ ఫోన్ ఫీచర్లు,ధర,ఇతర వివరాలపై ఓ లుక్కేద్దాం. ఫిలిప్స్ S7221 5Gలో 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. Unisoc T765 ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. ఫొటోలు, వీడియోల కోసం వెనుక భాగంలో 64MP ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16MP కెమెరాను ఇచ్చారు.
వివరాలు
బ్యాటరీ విషయానికొస్తే..
బ్యాటరీ విషయానికొస్తే.. ఫిలిప్స్ S7221 5Gలో 5,700mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీని అమర్చారు.
భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను అందించారు.
ఈ ఫోన్ బరువు 210 గ్రాములు. బాక్స్‌లో స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఛార్జర్, ఎజెక్ట్ పిన్, టైప్-సి డేటా కేబుల్, స్క్రీన్ ప్రొటెక్టర్, ఫోన్ ప్రొటెక్షన్ కేస్‌ను కూడా అందిస్తున్నారు.
వివరాలు
ధరలు ఇలా..
ఫిలిప్స్ S7221 5G రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.20,499గా నిర్ణయించారు.
8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ.22,499కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఉంది. దీంతో దుమ్ము, నీటి చినుకుల నుంచి కొంతవరకు రక్షణ లభిస్తుంది. బ్లాక్, బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఫిలిప్స్ S7221 5Gను తీసుకొచ్చింది.