LOADING...
Planetary Parade: ఫిబ్రవరి 28న ప్లానెట్ పరేడ్..స్పష్టంగా కనిపించనున్న ఆరు గ్రహాలు..
ఫిబ్రవరి 28న ప్లానెట్ పరేడ్..స్పష్టంగా కనిపించనున్న ఆరు గ్రహాలు..

Planetary Parade: ఫిబ్రవరి 28న ప్లానెట్ పరేడ్..స్పష్టంగా కనిపించనున్న ఆరు గ్రహాలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్షం అనేది అనేక రహస్యాలతో నిండిపోయిన విస్తారమైన విశ్వం. అందులోని గ్రహాలు, నక్షత్ర సమూహాలు, గెలాక్సీలు మనసును మైమరపింపజేస్తుంటాయి. ఈ నేపథ్యంలో 2026 ఫిబ్రవరిలో ఆకాశంలో ఒక అరుదైన ఖగోళ సంఘటన కనిపించబోతోంది. అదే ఒకే వరుసలో ఆరు గ్రహాలు దర్శనమివ్వడం. ఈ దృశ్యాన్ని 'ప్లానెట్ పరేడ్' అని వ్యవహరిస్తారు. సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఈ గ్రహాలు భూమి నుంచి చూసినప్పుడు ఒకే సూటి రేఖలో నిలిచినట్లుగా కనిపిస్తాయి. ఖగోళ శాస్త్రంపై ఆసక్తి కలిగిన వారికి ఇది పండుగలాంటి అనుభూతిని ఇస్తుంది. ముందుగానే పూర్తి సమాచారం తెలుసుకుంటే ఈ విశేషాన్ని మన కళ్లారా వీక్షించి ఆనందించవచ్చు.

వివరాలు 

ఈ నెల 28వ తేదీన అరుదైన ఖగోళ దృశ్యం

ఈ నెల 28వ తేదీన ఈ అరుదైన ఖగోళ దృశ్యం ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. ఆ రోజు బుధుడు, శుక్రుడు, శని, గురుగ్రహం వంటి ముఖ్య గ్రహాలతో కలిపి మొత్తం ఆరు గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. నాసా తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజు ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది; మేఘాలు లేకపోవడంతో ప్రజలు ఈ దృశ్యాన్ని స్పష్టంగా వీక్షించగలరు. సూర్యాస్తమయం తరువాత పశ్చిమ దిశలో శుక్రగ్రహం అత్యంత ప్రకాశవంతంగా మెరవనుంది. దాని పైన బుధుడు, శనిగ్రహాలు వరుసగా దర్శనమిస్తాయి. ఈ అమరికలో గురుగ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇది సాయంత్రం 6 గంటల సమయంలో తూర్పు దిశలో కనిపించి తెల్లవారుజామున వరకు ఆకాశంలోనే ఉంటుంది.

వివరాలు 

మళ్ళీ ఈ గ్రహాల పరేడ్ ఎప్పుడు చుడచ్చంటే.. 

శనిగ్రహం నైరుతి దిశలో సాధారణ కళ్లకూ కనిపిస్తుంది.అదే సమయంలో పౌర్ణమి చంద్రుడు ఆకాశాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాడు. బుధుడు,శుక్రుడు మాత్రం కొద్ది సేపే కనిపించి పశ్చిమ దిశలో అస్తమిస్తాయి. గ్రహాలు నక్షత్రాలకంటే ఎక్కువ కాంతితో,స్థిరంగా మెరవడం వల్ల వాటిని గుర్తించడం సాధారణ ప్రజలకు కష్టం కాదు. యురేనస్,మరుగుజ్జు గ్రహం ప్లూటో వంటి కొన్ని ఖగోళ వస్తువులను చూడాలంటే టెలిస్కోప్ అవసరం. టెలిస్కోప్ సహాయంతో శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలు,గురుగ్రహంపై కనిపించే రెడ్ స్పాట్ వంటి ప్రత్యేక లక్షణాలు స్పష్టంగా చూడవచ్చు. శక్తివంతమైన బైనాక్యులర్ ఉన్నవారు ఈగ్రహాలను చిన్న గోళాల్లా గమనించగలరు. ఇప్పుడు ఫిబ్రవరి 2026లో కనిపించేలా గ్రహాలపరేడ్ మళ్లీ చూడాలంటే 2028 లేదా 2034 వరకు వేచి చూడాల్సి ఉంటుందని నాసా వెల్లడించింది.

Advertisement