వాట్సాప్ ఛానెల్స్ లో జాయిన్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ, మొదటి పోస్ట్ ఇదే
వాట్సాప్ కొత్తగా ఛానెల్స్ అనే ఫీఛర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో అడ్మిన్ ఒక్కరే, మెసేజ్ పంపించవచ్చు. వాళ్ళను ఫాలో అయ్యేవాళ్ళు ఎలాంటి మెసేజ్ పంపడానికి లేదు. సాంకేతికను అందుకోవడంలో ముందుండే భారత ప్రధాని నరేంద్ర మోదీ, వాట్సాప్ కొత్త ఫీఛర్ ఛానెల్స్ లో జాయిన్ అయ్యారు. వాట్సాప్ లో జాయిన్ కావడం థ్రిల్లింగ్ గా ఉందనీ, ప్రజలతో సంభాషణలు జరపడానికి ఇది మరింత దగ్గర చేస్తుందనీ, కొత్త పార్లమెంట్ భవంతి ఫోటోను షేర్ చేస్తున్నానని మెసేజ్ పెట్టారు. వాట్సాప్ ఛానల్స్ లో నరేంద్ర మోదీని ఫాలో అయ్యే వారందరికీ ఈ మెసేజ్ వెళ్తుంది.
ఛానల్స్ లో జాయిన్ అయిన సెలెబ్రిటీలు
ప్రధాని మాత్రమే కాదు భారత క్రికెట్ జట్టు, బాలీవుడ్ సెలెబ్రిటీ అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, విజయ్ దేవరకొండ, కత్రినా కైఫ్ మొదలగు వారందరూ వాట్సాప్ ఛానెల్స్ లో జాయిన్ అయ్యారు. వాట్సాప్ లో ఛానల్స్ ఎక్కడ కనిపిస్తాయి? వాట్సాప్ లో అప్డేట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి కిందకు వెళ్తే ఛానల్స్ కనిపిస్తాయి. అక్కడ మీకు నచ్చిన వారిని మీరు ఫాలో కావొచ్చు. ఇందులో ఫోన్ నంబర్ ఇవ్వకుండానే ఫాలో కావొచ్చు. దేశాన్ని బట్టి ఆయా దేశాల పాపులర్ పర్సన్స్ ఛానల్స్ కనిపిస్తుంటాయి. ఎక్కువ మంది ఫాలో అయ్యే వారి ఛానల్స్ అప్డేట్స్ లో మొదటి వరుసలో కనిపిస్తాయి.