
Chandrayaan3: స్లీప్ మోడల్‌లోకి ప్రజ్ఞాన్ రోవర్.. కారణమిదే?
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రయాన్-3 మిషన్‌లో ప్రజ్ఞాన్ రోవర్ తొలి విడత ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన భారత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు తమకు నిర్దేశించిన లక్ష్యాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని విశ్రాంతికి సిద్ధమయ్యాయి.
తొలుత రోవర్‌ను నిద్రాణ స్థితిలోకి పంపేసినట్లు ఇస్రో శనివారం రాత్రి ప్రకటించింది.
ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ రోవర్ లక్ష్యాలను పూర్తి చేసిందని, దాన్ని ఇప్పుడు సురక్షిత ప్రదేశంలో ఉంచి, నిద్రాణ స్థితిలోకి పంపామన్నారు.
ఏపీఎక్స్ఎస్, లిబ్స్ పరికరాలను స్విచ్ఛాప్ చేశామని, ఈ రెండు సాధానాల నుంచి డేటా, ల్యాండర్ ద్వారా భూమికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు.
Details
చంద్రుడిపై 100 మీటర్లు ప్రయాణించిన ప్రజ్ఞాన్ రోవర్
ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై 100 మీటర్ల దూరం ప్రయాణించినట్లు ఇస్రో వెల్లడించింది. రోవర్ ప్రయాణించిన మార్గానికి సంబంధించిన ఫోటోను కూడా ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దీంతో ప్రజ్ఞాన్ రోవర్ సెంచరీ కొట్టినట్లు ఇస్రో సరాదాగా రాసుకొచ్చింది. జాబిల్లిపై 14రోజుల పగలు పూర్తి కావస్తోంది.
శివశక్తి పాయింట్ వద్ద ఇప్పటికే సాయకాలం మొదలై చీకటీ అలుముకుంటోంది. ఇక అక్కడ రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు 200 డిగ్రీలకు పడిపోతాయి.
ఇంత అసాధారణశీతల వాతావరణాన్ని ల్యాండర్, రోవర్‌లోని సున్నితమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తట్టుకోలేవు. దీంతో రోవర్‌ను స్లీప్ మోడల్‌లో ఉంచుతున్నారు.
ఈనెల 22శివ్‌శక్తి పాయింట్ వద్ద సుర్యోదయమవుతుందని, తద్వారా మరో విడత లక్ష్యాలను ఛేదించేందుకు రోవర్ సిద్ధమవుతుంది. లేదంటే ప్రతినిధిగా చంద్రుడిపై శాశ్వతంగా ఉండిపోనుంది.