
Rafale Fighter Jet: భారత్‌లో అత్యంత శక్తివంతమైన రాఫెల్ యుద్ధ విమానం.. ప్రత్యేకతలివే!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం వద్ద ప్రస్తుతం ఉన్న అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన యుద్ధ విమానాల్లో 'రాఫెల్ ఫైటర్ జెట్' ముఖ్యమైంది.
ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకున్న ఈ యుద్ధ విమానం ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధ విమానాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
భారత్-ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, రాఫెల్ విమానాలను భారత వాయుసేనలోకి చేర్చారు. ఈ విమానాలు 5th జనరేషన్ ఫైటర్ జెట్‌లుగా పేరుగాంచాయి.
అవి ఏకకాలంలో ఏరియల్ కాంబాట్, గ్రౌండ్ అటాక్ నేవల్ మిషన్లలో పాల్గొనే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
Details
సూపర్‌సోనిక్ వేగం
రాఫెల్ యుద్ధ విమానానికి గంటకు 2,222 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే శక్తి ఉంది. ఇది శత్రువుకు కనపడకుండా దాడి చేసే ప్రత్యేకత కలిగి ఉండటంతో పాటు, రాడార్లకు కూడా చిక్కదు.
రేంజ్
ఒకసారి ఫ్యూయల్ నింపితే ఈ విమానం 3,700 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదు. దీనికి గాలిలోనే ఎయిర్ రీఫ్యులింగ్ సౌలభ్యం కూడా ఉంది.
శక్తివంతమైన ఆయుధాలు
రాఫెల్ యుద్ధ విమానం అత్యాధునిక ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఇందులో ముఖ్యంగా:
Meteor (ఎయిర్-టు-ఎయిర్) మిసైల్
SCALP (ఎయిర్-టు-గ్రౌండ్) క్రూయిజ్ మిసైల్
HAMMER బాంబులు ఇవన్నీ ఇందులో అమర్చే అవకాశం ఉంది.
Details
అధునాతన రాడార్ వ్యవస్థ
రాఫెల్‌లో AESA (Active Electronically Scanned Array) రాడార్ వ్యవస్థను అమర్చారు. ఇది వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించగలదు.
ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ టెక్నాలజీ
రాఫెల్‌కు SPECTRA అనే ప్రత్యేకమైన డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇది శత్రు రాడార్‌లను మాయ చేయగలదు, అలాగే వచ్చే మిసైల్‌ల నుంచి విమానాన్ని తప్పించగల సామర్థ్యం కలిగి ఉంది.
ట్విన్ ఇంజిన్ పవర్తో విశ్వసనీయత
ఈ విమానంలో రెండు శక్తివంతమైన ఇంజిన్లు ఉన్నాయి. ఒక ఇంజిన్ విఫలమైనా రెండో ఇంజిన్ ద్వారా విమానం కొనసాగగలదు.
రాఫెల్‌లు చిన్న రన్‌వేలు, హై వేలు, రిమోట్ ప్రాంతాల్లో కూడా సులభంగా ల్యాండ్ అయ్యే శక్తి కలిగి ఉన్నాయి.
Details
ప్రతికూల వాతావరణంలో కూడా పని చేయగలదు
చీకటి, వర్షం, మంచు వంటి ప్రతికూల వాతావరణంలో కూడా రాఫెల్ తన పని తీరు మారదు. అన్ని పరిస్థితుల్లో ఇదే పనితీరుతో ముందుకు సాగుతుంది.
ఇటీవల ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ రాఫెల్ యుద్ధ విమానాలను వినియోగించిన సంగతి తెలిసిందే. లక్ష్యాన్ని సమర్థంగా ఛేదించడంలో రాఫెల్ మరోసారి తన సామర్థ్యాన్ని చాటింది.