LOADING...
Rare comet: ఆకాశంలో అరుదైన అద్భుతం.. మరోసారి చూడాలంటే 1.7 లక్షల ఏళ్లు వేచి చూడాలి!
ఆకాశంలో అరుదైన అద్భుతం.. మరోసారి చూడాలంటే 1.7 లక్షల ఏళ్లు వేచి చూడాలి!

Rare comet: ఆకాశంలో అరుదైన అద్భుతం.. మరోసారి చూడాలంటే 1.7 లక్షల ఏళ్లు వేచి చూడాలి!

వ్రాసిన వారు Sirish Praharaju
May 04, 2026
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ అర్ధగోళ ఆకాశంలో అరుదైన తోకచుక్క సందడి చేయబోతోంది. సౌర వ్యవస్థ అంచుల్లో ఏర్పడిన C/2025 R3 PanSTARRS అనే ఈ కామెట్‌ గతంలో ఉత్తర అర్ధగోళంలో కనిపించి, ఇప్పుడు సూర్యుడి చుట్టూ తిరిగి దక్షిణ ప్రాంతాలకు చేరింది. న్యూజిలాండ్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జోష్ ఆఓరాకి తెలిపిన వివరాల ప్రకారం, ఇది కాస్త ప్రకాశవంతంగా ఉన్నా నేరుగా కంటికి కనిపించదు. దాన్ని చూడాలంటే బైనాక్యులర్స్‌, టెలిస్కోప్‌ లేదా కెమెరా అవసరం.

వివరాలు 

సూర్యాస్తమయం తర్వాత గంటసేపు మాత్రమే కనిపించే కామెట్

వచ్చే రెండు వారాల్లో దీని ప్రకాశం క్రమంగా తగ్గిపోతుంది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ దిశలో స్పష్టంగా చూడవచ్చు. సూర్యాస్తమయం తర్వాత గంటసేపు మాత్రమే కనిపించే ఈ కామెట్.. నీలం-ఆకుపచ్చ రంగులో, తోకతో ఆకట్టుకుంటుంది. ఓర్ట్ క్లౌడ్ నుంచి వచ్చిన ఈ కామెట్‌ సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి సుమారు 1.7 లక్షల సంవత్సరాలు పడుతుంది. మళ్లీ తిరిగి వస్తుందో, లేక సౌరవ్యవస్థ నుంచి బయటకు వెళ్లిపోతుందో అనేది స్పష్టంగా తెలియదు.

Advertisement