Salesforce: ఏఐ విస్తరణకు సేల్స్‌ఫోర్స్ భారీ అడుగు.. 1000 మంది ఫ్రెషర్ల నియామకం!
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (AI) ప్రభావంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయనే చర్చ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు అనుగుణంగానే మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, గూగుల్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతూ వేలాది ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి. అయితే దీనికి భిన్నంగా సేల్స్‌ఫోర్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ విస్తరణను వేగవంతం చేయడానికి వెయ్యి మంది ఫ్రెషర్లను నియమించనున్నట్లు ప్రకటించింది. కొత్త గ్రాడ్యుయేట్లు, ఇంటర్న్స్ అవసరం ఉందని సీఈఓ మార్క్ బెనియాఫ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. "ఏజెంట్‌ఫోర్స్, హెడ్‌లెస్ 360 వంటి ఏఐ ఆధారిత ప్రాజెక్టుల కోసం యువ ప్రతిభ అవసరమని ఆయన తెలిపారు.
వివరాలు
ఫ్రెషర్ల పాత్ర కీలక
ఏఐ నిర్మాణం, అభివృద్ధిలో ఫ్రెషర్లు కీలక పాత్ర పోషిస్తారని స్పష్టం చేశారు. ఈ నియామకాలు గతేడాదితో పోలిస్తే 5.6 శాతం పెరిగినట్లు ఏఐ, క్రిప్టో జార్ డేవిడ్ శాక్స్ పేర్కొన్నారు. అయితే ఏఐ కారణంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు తగ్గుతున్నాయన్న వాదన నిజమేనని అంగీకరించినప్పటికీ, యువత కొత్త టెక్నాలజీని వేగంగా నేర్చుకుంటోందని మార్క్ బెనియాఫ్ అభిప్రాయపడ్డారు.