Page Loader
Samsung Galaxy Z fold 5: శాంసంగ్  నుండి లాంచ్ అయిన కొత్త ఫోన్ ఫీఛర్స్ ఇవే 
సామ్సంగ్ లాంచ్ చేసిన కొత్త మొబైల్ ఫీఛర్స్

Samsung Galaxy Z fold 5: శాంసంగ్  నుండి లాంచ్ అయిన కొత్త ఫోన్ ఫీఛర్స్ ఇవే 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 26, 2023
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

శాంసంగ్ మొబైల్స్ నుండి Samsung Galaxy Z fold 5 లాంచ్ అయ్యింది. ఫోల్డ్ చేయగలిగే ప్రత్యేక ఫీఛర్ తో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ లో ఎన్నో ప్రత్యేక ఫీఛర్లు ఉన్నాయి. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఫ్లాట్ ఫామ్ తో ఉన్న ఈ మొబైల్ స్క్రీన్ 7.6అంగుళాల QXGA+స్క్రీన్ ని కలిగి ఉంది. భారతీయ మార్కెట్ లో ఈ మొబైల్ ధరను సామ్సంగ్ కంపెనీ ఇంకా వెల్లడి చేయలేదు. మరికొద్ది రోజుల్లో భారతీయ మార్కెట్లో దీని ధరను ప్రకటించనున్నారు. Galaxy Z fold 5 లో రీసైకిల్ మెటీరియల్స్ ఉన్నాయి. రీసైకిల్ గ్లాస్, వాటర్ బారెల్స్, పెట్ బాటిల్స్ నుండి తీసుకోబడిన రీసైకిల్స్ ప్లాస్టిక్స్ ఉన్నాయి.

Details

సెపరేట్ గా అడాప్టర్ కేబుల్ కొనాల్సిందే 

67.1 x 154.9 x 13.4mm సైజుతో ఉన్న ఈ మొబైల్ ఫోన్, 253గ్రాముల బరువుతో ఉంది. FOV: 85తో 10MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 4MP అండర్ డిస్ ప్లే కెమెరా, 50MP వైడ్ యాంగిల్ కెమెరా, 12MP బ్యాక్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉంది. 12GB RAM మెమోరీ, 256GB, 512GB, 1TB స్టోరేజి కలిగి ఉంది. 4,400mAh పవర్ తో డ్యుయల్ బ్యాటరీ ఉంటుంది. 25W అడాప్టర్ తో 50శాతం ఛార్జింగ్ 30నిమిషాల్లో నిండిపోతుంది. ఛార్జింగ్ కేబుల్ ని సెపరేట్ గా కొనాల్సిందే. IPX8 రేటింగ్ ఉన్న ఈ మొబైల్ ఫోన్ 1.5మీటర్ల స్వఛ్ఛమైన నీటిలో 30నిమిషాల వరకు తడిచినా తట్టుకోగలుగుతుంది.

Details

Samsung Galaxy Z Flip 5 మొబైల్ ఫోన్ ఫీఛర్స్ 

ఫోల్డబుల్ ఫోన్ల లాంచ్ కార్యక్రమంలో భాగంగా Galaxy Z Flip 5 ని సామ్సంగ్ లాంచ్ చేసింది. 6.7అంగుళాల FHD+ Dynamic AMOLED డిస్ ప్లే కలిగి ఉన్న ఈ మొబైల్ ఫోన్, 8GB RAM మెమొరీతో క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ని కలిగి ఉంది. 256GB. 512GB స్టోరేజీతో 3,700mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉండి 25W అడాప్టర్ తో 30నిమిషాల్లో 50శాతం ఛార్జ్ అయ్యే సామర్థ్యం ఉంటుంది. USB-C cable, 2.0 ఫాస్ట్ వైర్ లెస్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.