Page Loader
ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చగలిగే అద్భుతమైన పదార్ధం
ఈ పరిశోధన ద్వారా సౌర పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు

ప్లాస్టిక్‌ను ఇంధనంగా మార్చగలిగే అద్భుతమైన పదార్ధం

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 10, 2023
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌరశక్తిని ఉపయోగించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు, గ్రీన్‌హౌస్ వాయువులను స్థిరమైన ఇంధనాలుగా మార్చగల వ్యవస్థను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. రెండు వ్యర్థ ప్రవాహాలు ఏకకాలంలో రెండు రసాయన ఉత్పత్తులుగా మారడం సౌరశక్తితో పనిచేసే రియాక్టర్‌లో సాధించడం ఇదే మొదటిసారి. ఈ పరిశోధన ద్వారా సౌర పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముంది. ఈ పెరోవ్‌స్కైట్ పదార్ధం సాంప్రదాయ సిలికాన్ కు మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది చౌకగా తయారవుతుంది. పెరోవ్‌స్కైట్ వ్యర్థ ప్లాస్టిక్ సీసాలను గ్లైకోలిక్ యాసిడ్‌గా మారుస్తుంది, సౌందర్య సాధనాల రంగంలో ఉపయోగించబడుతుంది. సౌరశక్తితో పనిచేసే రియాక్టర్‌ ఉపయోగించిన ఉత్ప్రేరకం రకాన్ని మార్చడం ద్వారా వివిధ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించచ్చు.

పరిష్కారం

వాతావరణ సంక్షోభానికి ఇది అర్దవంతమైన పరిష్కారం

సోలార్ ఆధారిత కార్బన్ డయాక్సైడ్ ప్లాస్టిక్‌లను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం వలన ఆర్థిక వ్యవస్థకు స్థిరమైన మార్గాన్ని అందిస్తుంది అని అధ్యయనం పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తులను గరిష్టంగా రీసైక్లింగ్ చేయడం, వీలైనంత ఎక్కువ కాలం వాటిని నిల్వ ఉంచడం. ఇది ఉత్పత్తి జీవితకాలాన్ని పొడిగించడమే కాకుండా వ్యర్థాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇంతకుముందు, కార్బన్ డయాక్సైడ్‌ను అధిక-విలువ ఉత్పత్తులుగా ఎంపిక చేసి సమర్ధవంతంగా మార్చే పద్ధతి లేదు. వాతావరణ సంక్షోభాన్ని అర్థవంతంగా పరిష్కరించి, సౌర శక్తిని ఉపయోగించే ఇటువంటి పరిష్కారాలు సహజ ప్రపంచాన్ని రక్షించి వ్యర్థాలను పారేసే బదులు వ్యర్థాల నుండి ఉపయోగకరమైన వస్తువులను తయారుచేసి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.