25 Hours In a Day : 'ఇక రోజుకు 25 గంటలు'.. కారణం చెప్పిన శాస్త్రవేత్తలు..!
ఈ వార్తాకథనం ఏంటి
ఒక రోజు అంటే కేవలం 24 గంటలు మాత్రమే. రానున్న కాలంలో ఇక రోజుకు 25 గంటలు ఉండే అవకాశాలు లేకపోలేదు.
ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి ప్రధానమైక కారణం చంద్రుడు నిదానంగా దూరం జరిగిపోతుండటమే అని శాస్త్రవేతలు చెబుతున్నారు.
చంద్రుడు అంతకంతకూ దూరం కావడంతో భూమిపై ఒక రోజుకు 24 గంటలు బదులు 25 గంటలు అయ్యే ఛాన్స్ ఉందన్నారు.
చంద్రుడు సంవత్సరానికి సూమారు 3.8 సెంటీమీటర్ల చొప్పున భూమి నుంచి దూరం వెళుతున్నాడని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ పరిశోధన కేంద్రం తెలిపింది.
Details
గతంలో కాలాన్ని చెప్పేందుకు 'అస్ట్రోక్రోనాలజీ'
భూమి నుంచి చంద్రుడు వెనక్కి జరిగిపోతుండటం వల్ల 200 మిలియన్ సంవత్సరాల కాలంలో భూమికి రోజులో 25 గంటలు పడే అవకాశం ఉందన్నారు.
రోజుకు 25 గంటలు కావడానికి ప్రథమిక కారణం.. రెండింటి గురుత్వాకర్షణ పరస్పర చర్యలు అని ప్రొఫెసర్ స్టీఫెన్ మేయర్స్ అభిప్రాయపడ్డారు.
గతంలో కాలాన్ని చెప్పేందుకు 'అస్ట్రోక్రోనాలజీ' ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.