Astronomers: పాలపుంతలో అతి చిన్న బ్లాక్ హోల్ కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు
చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల పాలపుంతలో అతి చిన్న బ్లాక్ హోల్‌ను గుర్తించారు. సాంగ్ వాంగ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆవిష్కరణ భూమికి దాదాపు 5,825 కాంతి సంవత్సరాల దూరంలో చోటుచేసుకుంది. ఈ విప్లవాత్మక ప్రకటనకు "G3425" అని పేరు పెట్టారు. G3425 అనే రెడ్ జెయింట్ నక్షత్రం అనేక కాలం నుంచి ఓ అదృశ్య సహచరుడితో కలిసి కక్ష్యలో సంచరిస్తున్నట్లు గమనించారు. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు దానిని సహచారి బ్లాక్ హోల్ అని నిర్ధారించారు. ఇది సూర్యుడి ద్రవ్యరాశికి 3.6 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉన్నట్లు వారు తెలిపారు.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కీలక పాత్ర
ఈ బ్లాక్ హోల్ ఆవిష్కరణ కాల రంధ్రాల నిర్మాణం, వాటి పరిణామం మీద ప్రస్తుత సిద్ధాంతాలను సవాలు చేస్తోంది. G3425 బ్లాక్ హోల్ తన విస్తృత కక్ష్య ద్వారా కొత్త సమీకరణాలను తెస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ ఆవిష్కరణలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క గియా మిషన్ కీలక పాత్ర పోషించింది. ఈ మిషన్ వల్ల పాలపుంతలో కనిపించని ఖగోళ వస్తువుల కదలికలను గుర్తించారు. G3425 వంటి చిన్న బ్లాక్ హోల్స్ పై ఉన్న రహస్యాల్ని మరింత పరిచయం చేసేందుకు ఇది దారి చూపనుంది.